DNS Media | Latest News, Breaking News And Update In Telugu

25 మంది తో తొలి విడత టిటిడి ట్రస్ట్ జాబితా విడుదల

*విశాఖపట్నం, సెప్టెంబర్ 15, 2021 (డిఎన్ఎస్):* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* ప్రపంచంలోనే ఎంతోఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లో పాలక మండలి మొదటి జాబితా 25 మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ బోర్డు నియామకం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పై తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయం తెలిసిందే. అన్ని

సామజిక వర్గాలను, అజెండాలను లెక్కలోకి తీసుకుని, రానున్న ఎన్నికల దృష్ట్యా అన్నింటినీ బేరీజు వేసుకుని తొలివిడత గా 25 మందితో టీటీడీ పాలకమండలి జాబితా విడుదల చేసారు. వీరిలో కొంతమంది పాత  బోర్డు సభ్యులు ఉన్నప్పడికి కొంతమంది మొదటి సారి నియమితులైన వారు. త్వరలోనే మిగిలిన అంశాలు బేరీజు వేసుకుని రెండో జాబితా, అవసరమైంటె మూడో

జాబితా కూడా విడుదల కావచ్చు అనే వార్తలు వెలువడుతున్నాయి.  

టీటీడీ పాలకమండలి సభ్యులు..

ఆంధ్ర ప్రదేశ్  నుంచి. పొకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గొల్లా బాబురావు, బుర్రా మధుసూధన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి.,

తెలంగాణ నుంచి : మై హోమ్ రామేశ్వర రావు, పార్థసారథి

రెడ్డి, లక్ష్మి నారాయణ, మారంశెట్టి రాములు, విద్యా సాగర్, మన్నే జీవన్ రెడ్డి, రాజేష్ శర్మ

తమిళనాడు నుంచి : శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య.

కర్ణాటక నుంచి : శశిధర్ ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam