DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప‌నితీరు మెరుగుప‌రిచేందుకే త‌నిఖీ: కలెక్టర్ సూర్యకుమారి 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విజయనగరం, సెప్టెంబర్ 16, 2021 (డిఎన్ఎస్):* విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఏ. సూర్య‌కుమారి గంట్యాడ మండ‌ల కేంద్రంలో గురువారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థ‌ల‌ను త‌నిఖీ చేశారు. ప‌లువురు రైతులు, ప్ర‌జలతో మాట్లాడి పంట‌ల

ప‌రిస్థితి, ఎరువుల ల‌భ్య‌త‌, ఇ-క్రాప్ న‌మోదు వంటి అంశాల‌పై ఆరా తీశారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ ఏవిధంగా జ‌రుగుతుందో తెలుసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ వేయించుకుంటున్న‌దీ లేనిదీ ఆరా తీశారు. మండ‌ల కేంద్రంలోని మోడ‌ల్ స్కూల్‌, రైతుభ‌రోసా కేంద్రం, గ్రామ స‌చివాల‌యం త‌దిత‌ర ప్ర‌భుత్వ

సంస్థ‌ల‌ను క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేసి వాటి ప‌నితీరు తెలుసుకున్నారు.

తొలుత గంట్యాడ మండ‌లం కేంద్రానికి చేరుకొని మోడ‌ల్ స్కూల్‌ను సంద‌ర్శించారు. అక్క‌డి త‌ర‌గ‌తి గ‌దుల్లోకి వెళ్లి విద్యార్ధుల‌తో మాట్లాడారు. వారికి చెబుతున్న విద్యాంశాల‌పై ఆరా తీశారు. పాఠ‌శాల ఉపాధ్యాయుల‌తో మాట్లాడి ఈ

స్కూలులో సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు. విద్యార్ధుల‌కు తాగునీటిని అందించే నీటి శుద్ధి ప్లాంటు ప‌నిచేయ‌డం లేద‌ని తెలుసుకొని వెంట‌నే మ‌ర‌మ్మ‌త్తులు చేసి పున‌రుద్ద‌రించాల‌ని జిల్లా విద్యాశాఖ అధికారిని ఫోనులో ఆదేశించారు.

గ్రామ స‌చివాల‌యాన్ని తనిఖీ చేసిన క‌లెక్ట‌ర్ అక్క‌డి

రిజిష్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. సిబ్బంది మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్‌ను త‌నిఖీ చేశారు. సిబ్బంది అంతా స‌కాలంలో విధులకు హాజ‌రవుతున్న‌దీ లేనిద అడిగి తెలుసుకున్నారు. కంప్యూట‌ర్‌లో పెండింగ్ విన‌తులు చూపించాల‌ని స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించి ఆన్ లైన్ లో పెండింగ్ విన‌తుల‌ను ప‌రిశీలించారు. గ్రామ

ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు క‌లిగి వుంటూ స‌చివాల‌యానికి వినతులు ఇవ్వ‌డం కోసం వ‌చ్చే వారికి, ఇత‌ర సేవ‌ల కోసం వ‌చ్చే వారిని గౌర‌వించాల‌ని సూచించారు.

రైతుభ‌రోసా కేంద్రాన్ని సంద‌ర్శించిన జిల్లా క‌లెక్ట‌ర్ వ్య‌వ‌సాయ, ఉద్యాన అధికారుల‌తోను, రైతుల‌తోను మాట్లాడారు. ఈ కేంద్రం ద్వారా

రైతుల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను గురించి వ్యవ‌సాయ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ప‌లువురు రైతుల‌తో మాట్లాడి ఇ-క్రాప్‌, ఎరువుల పంపిణీ జ‌రుగుతున్న తీరుపై తెలుసుకున్నారు. ఉద్యాన శాఖ‌, మ‌త్స్య‌శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో యూనిట్ల ఏర్పాటు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. వ్య‌వ‌సాయ‌శాఖ ఏ.డి.

ఆర్‌.శ్రీ‌నివాస‌రావు, ఏ.ఓ. హ‌ర్ష‌ల‌త‌, ఉద్యాన స‌హాయ‌కురాలు సాహితి త‌దిత‌రులు త‌మ శాఖ‌ల ద్వారా రైతుల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను వివ‌రించారు.

గ్రామంలో నిర్మాణ ద‌శ‌లో ఉన్న రైతుభ‌రోసా కేంద్ర భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు. ఈ భ‌వనాన్ని త్వ‌ర‌గా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని

ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

గ్రామంలో పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల‌ను ప‌రిశీలించి త్వ‌రగా ఇళ్లు నిర్మించుకోవాల‌ని, ప్ర‌భుత్వం ఇళ్ల నిర్మాణానికి అద‌న‌పు రుణ‌స‌హాయం కూడా బ్యాంకుల ద్వారా అందిస్తుంద‌ని, దీనిని వినియోగించుకొని త్వ‌ర‌గా

నిర్మాణం పూర్తిచేసుకోవాల‌ని సూచించారు.

 ప‌లువురు గ్రామ‌స్థుల‌తో మాట్లాడి కోవిడ్ వ్యాక్సిన్ అంద‌రూ వేయించుకుంటున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు. కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ కోసం ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ వేసుకోవాల‌ని, ఈ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహ‌ల‌కు తావులేద‌ని పేర్కొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam