DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చ‌ట్టాల‌పై అంద‌రూ అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి: జ‌డ్జి ల‌క్ష్మీరాజ్యం

*విజయనగరం, సెప్టెంబర్ 17, 2021 (డిఎన్ఎస్):* ప్ర‌జ‌లంద‌రూ చ‌ట్టాల‌పై త‌ప్ప‌కుండా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, చ‌ట్టాల‌ ముఖ్య ఉద్దేశాల‌ను తెలుసుకోవాల‌ని విజ‌య‌న‌గ‌రం సీనియర్ సివిల్ జ‌డ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి వి. ల‌క్ష్మీ రాజ్యం పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం విజ‌య‌న‌గ‌రం మండ‌ల ప‌రిధిలోని దుప్పాడ గ్రామంలో నిర్వ‌హించిన న్యాయ అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల‌పై, రాజ్యంగ‌ప‌ర‌మైన అంశాలపై అవ‌గాహ‌న క‌ల్పించే ముఖ్య ఉద్దేశంతోనే ఇలాంటి స‌ద‌స్సులు

నిర్వహిస్తున్నామ‌ని, వీటిని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. క‌లహాలు లేని, మ‌న‌స్ఫ‌ర్థ‌లు లేని స‌మాజ నిర్మాణం జ‌ర‌గాల‌ని, ప్ర‌శాంత‌మైన కుటుంబ వ్య‌వ‌స్థ రూపుదిద్దుకోవాల‌ని ఆమె ఆకాంక్షించారు.

చిన్నచిన్న విష‌యాల‌కే పోలీసు స్టేష‌న్ల‌ను,

కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌కుండా స్థానికంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని హితవు ప‌లికారు. అంద‌రూ సోద‌ర‌భావంతో మెల‌గాల‌ని ప్ర‌శాంత‌మైన జీవితాల‌ను గ‌డ‌పాల‌ని సూచించారు. భార‌త రాజ్యాంగం క‌ల్పించిన అన్ని హ‌క్కుల‌ను ప్ర‌తి పౌరుడూ స‌ద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. న్యాయ వ్య‌వ‌స్థ ఎన్నో విధాలుగా

ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తోంద‌ని, దానిలో భాగంగానే న్యాయ సేవాధికార సంస్థ‌ను అందుబాటులోకి తీసుకొచ్చింద‌ని గుర్తు చేశారు. పేద ప్ర‌జ‌ల‌కు, వెనుక‌బ‌డిన ప్ర‌జ‌ల‌కు న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌న్నారు. అన్యాయం జ‌రిగి.. ఆర్థికంగా స్తోమ‌త లేని వారు న్యాయ సేవాధికార సంస్థ‌ను ఆశ్ర‌యించి

సాయం పొంద‌వ‌చ్చ‌ని ఆమె సూచించారు. స‌మాజంలో అంద‌రూ స‌మామేన‌ని, ఎలాంటి వివ‌క్ష‌త‌ల‌కు తావులేద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ స్వేచ్చ‌గా, గౌర‌వంగా బ్ర‌తికే హ‌క్కు ఉంద‌ని గుర్తు చేశారు. ఇత‌రుల స్వేచ్చ‌ను హ‌రించే హ‌క్కుగానీ, గౌర‌వానికి భంగం క‌లిగించే హ‌క్కుగానీ ఎవ‌రికీ లేవ‌ని

అన్నారు. ముందు సమాజంలో ఉన్న మనుషులు మారాల‌ని, ఆవేశంగా కాకుండా ప్ర‌శాంతంగా ఆలోచించాల‌ని సూచించారు. అలాగే రాజీ ప‌డ‌ద‌గ్గ కేసుల్లో మాత్ర‌మే రాజీ మార్గాల‌ను అనుస‌రించాల‌ని, రాజీ ప‌డ‌కూడ‌ని కేసుల్లో త‌ల‌దూర్చి స‌మ‌స్య‌ల్లో చిక్కుకోవ‌ద్ద‌ని సూచించారు. లోక్ అదాల‌త్ సేవ‌ల‌ను

వినియోగించుకోవాల‌ని చెప్పారు.

స‌ద‌స్సులో స్థానిక త‌హ‌శీల్దార్ ప్ర‌భాక‌ర్‌, ఎంపీడీవో ఏవీఎన్ చైనులు, ఎస్‌.ఐ. విజ‌య్ కుమార్‌, దుప్పాడ గ్రామ స‌ర్పంచ్ రాముల‌ప్ప‌డు, పీఏసీఎస్ అధ్య‌క్షుడు త్రినాథ‌రావు, న్యాయ‌వాదులు గోదాదేవి, తాడిరాజు, పైడిత‌ల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam