DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం గుళ్లో అత్యంత సాహసోపేత ఘట్టం విమాన పవిత్రం

*ఆలయ ప్రాంతాలన్నిటా ఆగమోక్తంగా పవిత్ర సమర్పణం* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం సింహాచలం లో జరుగుతున్నా పవిత్రోత్సవాల్లో ఆదివారం అర్చక, వైదిక సిబ్బంది అత్యంత సాహసోపేతమైన వైదిక

ప్రక్రియను నిర్వహించారు. 
ఆలయ ప్రాంగణంలోని అన్ని ప్రాంతాలనూ పవిత్రాలను సమర్పించడం జరుగుతోంది. దానిలో భాగంగా ప్రధాన గర్భాలయ ప్రకారం విమాన గోపురం పైకి ఎక్కి చివరన ఉన్న సుదర్శన పెరుమాళ్ కు పవిత్రాలను సమర్పించారు. ఆలయంలో భండారీ ఇంచార్జి ఉప ప్రధాన అర్చకులు కరి సీతారామాచార్యులు ఎటువంటి తాడు సహాయ లేకుండా ఆలయ

గోపురాన్ని ఎక్కి ప్రతి విగ్రహానికి పవిత్రాన్ని సమర్పించారు. వైదిక సిబ్బంది మంత్రం పఠనం చేస్తుండగా, గోపురాన్ని ఎక్కారు. క్రింద నుంచి ఈ వైదిక ప్రక్రియ ను చూస్తున్న ఆలయ సిబ్బంది, భక్తులు ఎంతో ఉత్కంఠ అనుభవించారు. 

అనంతరం కరి సీతారామాచార్యులు మాట్లాడుతూ తమ ఆచార్యులు పూర్వ ప్రధాన అర్చకులు మోర్తా

సీతారామాచార్యులు కొన్నేళ్ల పాటు ఈ వైదిక ప్రక్రియను స్వయంగా ఆచరించి చూపించారన్నారు. వారి అనుగ్రహం వల్లనే ఈరోజు తాము ఆలయ విమాన శిఖరానికి చేరుకొని పవిత్రాలను సమర్పించడం జరిగిందన్నారు. 

ఆలయ స్థానాచార్యులు ఎస్టీపి రాజగోపాల్ మాట్లాడుతూ దేవాలయం లో వేంచేసిన మూల విరాట్ కు శరీరం లాంటిది ఆలయం అని, అందులో

గోపురం ప్రధానం అన్నారు.. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయంలో పవిత్ర సమర్పణ జరిగిందన్నారు. 

సింహాచలం లో నివసిస్తే చాలు ముక్తి లభిస్తుంది అని క్షేత్ర మహాత్మ్యం చెప్తోంది.  లేదా ఆలయం ఉన్న దిక్కు వైపుకు తిరిగి నమస్కరించుకున్న అంతే ఫలం లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారన్నారు.
 
సింహాచల క్షేత్రం లో ఆలయ

విమానానికి ప్రహ్లాద హృదయ పుండరీకం అని (విమాన పవిత్రం), పేరు. అందుకే దీనికి  పవిత్రం అలంకరించారు. గోపుర పవిత్రం, చక్ర పవిత్రం, విగ్రహ పవిత్రం చేయడం జరిగిందన్నారు.  

మనుషులు వస్త్రాలను ఎలా ధరిస్తామో అలాగే గోపురానికి కూడా అలంకారం పవిత్రం తో చేయడం జరిగిందన్నారు. 

ఆలయానికి పాద స్థానమైన ధ్వజ స్తంభం

నుంచి, ముఖ మండపం, మధ్య మండపం, ఆస్థాన మండపం, భోగ మండపం, ప్రాకారానికి పవిత్రం, నృత్య మండపానికి పవిత్రం, గర్భాలయం వరకూ అన్ని ప్రాంతాలనూ పవిత్రం అందించడం జరిగిందని వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam