DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చక సమాఖ్య ఆత్రేయ బాబు కు కోన క్లాసు తీసుకున్నారా?

*ఆత్రేయ బాబు వైఖరిపై  అర్చక జేఏసీ మండిపాటు* 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 20, 2021 (డిఎన్ఎస్):* అర్చక సంఘాల విషయమై రాష్ట్ర అర్చక సమాఖ్య ముసుగులో అగ్నిహోత్రం ఆత్రేయబాబు కు ఉపసభాపతి కోన రఘుపతి గట్టిగా క్లాసు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కోన ను కలిసి అర్చక

సంఘాల్లోని సభ్యులు, నేతలు ప్రతిపక్ష పార్టీలకు చెందినవారంటూ ఆత్రేయబాబు చెప్పే ప్రయత్నం చేయడం తో అయన గట్టిగా క్లాసు తీసుకోవడం జరిగింది. 

ఎవరు ఏమిటో నాకు తెలియదా ?, మిగిలిన అన్ని సంఘాల వాళ్లతో కలుపుకుంటు కలసి నవంబర్, డిసెంబరు నెలలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయండి అని సూచించారు. ఈ ప్రభుత్వం, నేను

ఉండగా మీ సమస్యలు లేకుండా చేయండి, ఇప్పుడు మీరు చేయించుకొకుండా ఆరొపణలుచేసుకుంటుంటే మీ సమస్యలు ఎప్పటికీ ఇలానే ఉంటాయన్నారు. దీంతో అక్కడున్న అర్చకులు అవాక్కయ్యారు. సమస్యల పరిష్కారానికి పంతాలు పట్టింపులుకు సమయంకాదని చెప్పకనే చేప్పారు.

*ఆత్రేయ బాబు వైఖరిపై  అర్చక జేఏసీ మండిపాటు* 

రాష్ట్ర అర్చక

సమాఖ్య ముసుగులో అగ్నిహోత్రం ఆత్రేయబాబు చేస్తున్న మితిమీరిన అవైఖరి పై ఆంధ్ర ప్రదేశ్ అర్చక సంఘాల జేఏసీ మండిపడింది. అర్చక సమాఖ్య ముసుగులో అధికార  పార్టీ నాయకులను తమ చేతిలో పెట్టుకోవాలనే తపనతొ ఉత్తరాంధ్ర , జె.ఎ.సి నాయకులపై  లేనిపోని అభాండాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అర్చకుల శ్రేయస్సు కోసం అన్ని సంఘాలతో కలసి

పనిచేయండి, లేని పక్షంలో సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని 
ఆత్రేయ బాబు ను హెచ్చరించారు. 

ఈనెల 15 తేదిన ఉపసభాపతి కోన రఘపతి ని, దేవాదాయ శాఖా  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయ శాఖా కమీషనర్ వాణీ మోహన్ ని అర్చక సంఘాల  జెఎసీ నాయకులు కలిసి అర్చక సమాఖ్య

ముసుగులో బడా నేతలుగా చెలామణి అవుతున్న ఆ ఇద్దరి బాబు లు అవలభిస్తున్న విధానాన్ని వివరించారు. 

అందుకు ప్రతిగా పోటిగా ఎప్పటిలాగనే తమ పబ్బం గడుపుకునేందుకు మంత్రి వెల్లంపల్లి, ఉపసభాపతి రఘపతి ల వద్దకు వెళ్లి  జెఎసి నేతలపై  ఆత్రేయ బాబు లేని పొని కల్పితాలు చెప్పడం పై మండిపడుతున్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam