DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడిపితో కుమ్మక్కయ్యానా.. సాక్ష్యం చూపించు: ఎంపీ భారత్

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 21, 2021 (డిఎన్ఎస్):* టిడిపి నేతలు బుచ్చయ్యతో  పెందుర్తి వెంకటేష్ తో నేను కుమ్మక్కయ్యానని సాక్ష్యాలు ఉంటే బయట పెట్టమని తూర్పుగోదావరి రాజమహేంద్రవరం, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు రాజమహేంద్రవరం ఎంపీ భరత్ సవాల్ విసిరారు.  మంగళవారం

నిర్వహించిన విలేకరుల సమావేశంలో భరత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావంతో క్రమశిక్షణ లిగిన కార్యకర్తగా పార్టీలో పనిచేస్తున్నానని, ముఖ్యమంత్రి జగన్ నా పైన నమ్మకంతో ఎంపీ గా అవకాశం ఇచ్చారన్నారు.  నా తమ్ముడు భరత్ అని ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు నాకు చాలు నన్నారు. 

ఇటీవల

కొంతమంది కుహనా నాయకులు నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్తున్నారంటూ పేరు చెప్పకుండానే జక్కంపూడి రాజాపై మండిపడ్డారు.  టిడిపి నేతలు బుచ్చయ్యతో  పెందుర్తి వెంకటేష్ లో నేను కుమ్మక్కయ్యానని సాక్ష్యాలు ఉంటే బయట పెట్టమని సవాల్ విసిరారు.  నీలా నేను చీకటి రాజకీయాలు చెయ్యను, నువ్వు చేసే ప్రతి దీ స్కూల్ కి వెళ్లే

పిల్లవాడిని అడిగితే చెప్తాడన్నారు. 

జేడి లక్ష్మీనారాయణ తో ఒక ప్రోగ్రాం లో మాత్రమే కలిశాను, నేను సెల్ఫీ దిగితే ఫూటేజ్ చెక్ చేసుకోండన్నారు.  ఆ సందర్భంలో సిఎం జగన్ పరిపాలనను జేడి ప్రశంసించారు. ట్రిపుర్ ఆర్ లా నాకు నీచ రాజకీయాల రావు చెయ్యను.. నన్ను రఘురామకృష్ణంరాజు తో పోల్చడం సిగ్గు చేటన్నారు.  గతంలో

ఎంపీలు కనపడట్లేదని వార్తలు వేశారు.. నేను సోషల్ మీడియాలో కనిపోస్తున్నాని నామీద పడుతున్నారు.

రాష్ట్రపతి ప్రధానులకు ఫోన్ చేసి ఆయన ఏ బాషలో మాట్లాడతారో ఇక్కడి ప్రజలకు తెలుసు. ఆయన చిటికేస్తే రాజమండ్రిలో వచ్చేది బ్లెడ్ బ్యాచ్, చైన్ స్నాచర్లు, గంజాయి బ్యాచ్.. నాకు పార్టీ ఇచ్చిన లక్ష్మణ గీత దాటను.. నువ్వు నీ

పరిధిలో ఉంటే మంచిదన్నారు. లెదంటే రెండు రాష్ట్రాల్లో నా సత్తా ఏంటో చూపిస్తా..

నీలాగే నేను కూడా కిడ్ లా ప్రవర్తిస్తే నీకు నాకు తేడా ఉండదు. నా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంతెంత నిధులు  తెచ్చి అభివృద్ధి చేసానో లెక్కలు చూసుకోమన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam