DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూత్వను విఛ్చిన్నం చేసేందుకు పుట్టిందే ఎండోమెంట్స్ 

*అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రకటన* 

*మన దేవాలయాలు మనకే లక్ష్య పాదయాత్రకు సంఘీభావం* 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* హిందూ సంప్రదాయాలను మంట గలుపుతూ, హిందూ సమాజాన్ని విఛ్చిన్నం చేసేందుకు వలస పాలకుల కుత్సిత ఆలోచనల ద్వారా

ఏర్పడిందే హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖా చట్టమని అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ అన్నారు.  

మన దేవాలయాలు మనకే అనే మహా నినాదంతో భాగ్యనగరం లోని కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి బయలు దేరిన మహా పాదయాత్ర గుంటూరుకు చేరుకున్న సందర్బంగా అఖిల భారత శ్రీవైష్ణవ

బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఘనస్వాగతం పలికింది. బుధవారం గుంటూరు వరకు దాదాపు 340 కి.మీ పాదయాత్ర పూర్తిచేసుకున్న సందర్భంగా దీనికి బాధ్యత వహించిన భగవద్రామానుజ సంక్షేమ సంఘం సభ్యులను హృదయపూర్వకంగా అభినందించింది. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దీనిలో భాగంగానే కోట్లాదిమంది హిందువులను లోబరుచుకోవడానికి

సువ్యవస్ధితమైన దేవాలయ వ్యవస్ధను, సనాతన విద్యావ్యవస్ధను విచ్ఛిన్నం చేయాలనే దురుద్దేశాలనుండి పుట్టినదే దేవాదాయ ధర్మాదాయ శాఖా అన్నారు.   

ఒక మహా సంకల్పంతో మొదలైన మహోన్నత ఉద్యమం తెలుగురాష్ట్రాల సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యమించాలన్నారు. ప్రభుత్వ హస్తాల నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి

కల్గించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. రాజకీయాలు, ఆగమాలు అతీతంగా సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు, సంప్రదాయాల హిందూ సంప్రదాయవాదులనూ కలుపుకుంటూ వెళ్తున్న ఈ యాత్ర సంపూర్ణ విజయం సాధించాలని అభిలషించారు.  

ఉపాధ్యక్షులు సి.ఎ.పి.ఎస్.రామానుజాచార్యులు మాట్లాడుతు ఇది దాతల, భక్తుల ఆశయాలకు పూర్తి విరుద్ధమైనదని,

సమసమాజ స్థాపనలో దేవాలయాలు ముఖ్యభూమిక పోషించాయని, కాబట్టి మళ్లి మన దేవాలయాలు మనచేతికి వచ్చిన నాడు భారతీయ సనాతన వైభవం మళ్లి కలుగుతుందని పిలుపునిచ్చారు. ఇది అందరి భారతీయుల కార్యక్రమమని అందరు స్వచ్ఛందంగా పాల్గొని మన ఐక్యతను చాటాలని కోరారు. 

సలహాదారు బి కె ఎస్ ఆర్ అయ్యంగార్ మాట్లాడుతూ అసలు దేవదాయ, ధర్మదాయ

చట్టమే చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని, సెక్యూలర్ ప్రభుత్వాలు మత సంబంధ విషయాలలో జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని కనుక ఎట్టిపరిస్ధితులలోను ప్రభుత్వాలు దేవాలయ వ్యవస్ధలో ఉండకూడదని దీనిపై సమాజానికి అవగాహన‌ కల్పించవలసిన అవసరముందని తెలిపారు. సంఘం, పాదయాత్ర సభ్యులు విరాళాలిచ్చిన ప్రతిఒక్కరికి

కృతజ్ఞతలు తెలియజేసారు

ఈ యాత్ర చేపట్టిన ధార్మిక బంధువులకు విజయవాడలో జరిగిన సమావేశంలో అఖిలభారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గం తరపున సలహాదారు బి కె ఎస్ ఆర్ అయ్యంగార్,  ప్రధాన కార్యదర్శి బాలబాలాజీ, ఇతర ప్రతినిధులు మన తాత్కాలిక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సి.ఎ.పి.ఎస్. రామానుజాచార్యులు,

కోశాధికారి అకలంకం పార్ధసారధి, సంయుక్త కార్యదర్శి ఎన్.సి.హెచ్.రఘు, ప్రచార కార్యదర్శి విద్యావతి తదితరులు సగౌరవ సత్కారం చేసారు. 

ఈ మహాపాదయాత్రకు సంఘం సంఘీభావంతో విరాళాలు సేకరించగా సహృదయులు స్పందించి ఇచ్చిన దాదాపు రూ.  33 వేల నగదు విరాళాలను కూడ అందించడం జరిగిందన్నారు. 

ఈ కార్యక్రమంలో తాళ్ళూరు

మఠం మఠాధిపతి పి.వి.ఎస్.ఎన్  ప్రసాదాచార్యులు గారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పి.టి.జి.వి.రంగాచార్యులుగారు, విశ్వహిందు పరిషత్, భజరంగదళ్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam