DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయ స్థూపానికి చారిత్రక వైభవం తీసుకొస్తాం: ఈఓ సూర్యకళ 

*ఆధ్యాత్మిక అభివృద్ధి దిశగా కృషి: సింహాచల క్షేత్ర ఈఓ సూర్యకళ*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* శ్రీకృష్ణ దేవరాయులు 1516 లో సింహాచల క్షేత్రము లో పై నెలకొల్పిన విజయస్థూపానికి చారిత్రక పూర్వ వైభవం తీసుకువస్తామని,  శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈఓ

సూర్యకళ తెలియచేసారు. గురువారం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాంత చరిత్రను తెలుసుకుని, నాటి విజయనగర వైభవ ప్రభావాన్ని ప్రస్తుత తరాలకు అందించేందుకై దాని అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈఈ  శ్రీనివాసరాజు, ఇంజనీరింగ్ విభాగ అధికారులతో చర్చించారు. 
వైకుంఠ నారాయణ స్వామి కొలువైన ఈ ప్రాంతాన్ని సుందరంగా

తీర్చిదిద్ది, శ్రీకృష్ణ  కృష్ణదేవరాయల విజయ స్థూపమున్న ప్రాంతాన్ని మంచి వ్యూ పాయింట్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలనాటి చారిత్రక వైభవం ప్రపంచానికి తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  దేవస్థానం కు వచ్చే యాత్రీకులు కొండపైనే రెండు మూడు గంటలు ఉండి వివిధ ప్రాంతాలను తిలకించేలా చారిత్రక, ఆధ్యాత్మిక

నేపథ్యమున్న ప్రాంతాలను తీర్చిదిద్దుతామని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam