DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*తిరుమల వాసుని అభిషేకానికి విశాఖ గిరుల తేనేలు*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో విశాఖ గిరుల ప్రకృతి సంపద వినియోగించే అద్భుతమైన అవకాశం లభించనుంది. ఆగస్టు 30 న తిరుమల పర్యటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ ఎస్ వి సుబ్బారెడ్డిని కలిసి టీటీడీలో గిరిజన కార్పొరేషన్(GCC)

ఉత్పత్తులకు అవకాశం కల్పించాలని  గిరిజన కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభా స్వాతీ రాణి కోరిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి TTD చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీచేశారు. 

టిటిడి వారి కార్యాలయం నుండి అధికారికముగా 1800 కేజీల తేనె స్వామి వారి అభిషేకానికి, ఇతర దేవాలయాల అభిషేకాలకు పంపిణీ చేయవలసిందిగా  అధికారిక

ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలు డా౹౹ శోభా స్వాతిరాణి పేరుతో GCC  కార్యాలయానికి పంపించడం జరిగింది.  

టీటీడీ వారు అడిగిన కేజీ తేనె ధర ను GCC వారు పంపించడం... ఆ ధరను టిటిడి అంగీకరిస్తూ ఈ ఆర్డర్ ను ఇవ్వడం జరిగింది. టీటీడీ నిర్ణయం వలన గిరిజనులకు ఆర్ధికం గా మేలు జరుగనుండటం! శుభ పరిణామం! అని

చెప్పవచ్చు!

గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ! ఆర్గానిక్ పద్ధతిలో తయారుచేసిన తేనె "తిరుమల వెంకటేశ్వర స్వామి" సేవకు అవకాశం కల్పించిన టీటీడీ చైర్మన్ కు గిరిజనుల  తరుపున  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నట్టు స్వాతిరాణి తెలిపారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam