DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ లో అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభం

*విద్య, ఉపాధిలో ఏంటో ఉపయోగం: సీఎం వైఎస్ జగన్* 

ఆంధ్రతో మరింత బంధం: యుఎస్ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ కు అధికారిక రాజధానిగా విశాఖపట్నం ప్రకటించనప్పడికి ఆ హోదాను మాత్రం అందించే ప్రయత్నాలు విస్తృతంగా

జరుగుతున్నాయి. దానిలో భాగంగానే విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో  అమెరికన్‌ కార్నర్‌ ను వర్చువల్‌ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గురువారం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ

ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టం విశాఖలో  జరిగేలా ఎంతో కృషి చేసిన అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో పాటు, యూఎస్‌ ఎయిడ్‌ మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమెరికాలోని ఆ ఉన్నతమైన పదవిలో ఒక తెలుగు వ్యక్తి.. ముఖ్యంగా నా సొంత జిల్లాకు చెందిన

మహిళ ఉండడం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. 
మీ సహాయ, సహకారాలతో ఇవాళ మొదలైన ఈ వ్యవస్థ ఎంతో ముందుకు సాగి ఇంకా మరెన్నో సేవలందించాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో అమెరికన్‌ కాన్సులేట్‌ ఏర్పాటు కావాలన్నదే మా అంతిమ లక్ష్యం. దేవుడి దయతో అది కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నామన్నారు.

విశాఖలో ఇవాళ

ఏర్పాటవుతున్న అమెరికన్‌ కార్నర్‌ దేశంలో మూడవది. దేశంలో ఇప్పటివరకు అహ్మదాబాద్, హైదరాబాద్‌లో అమెరికన్‌ కార్నర్లు పని చేస్తుండగా, ఇవాళ కొత్తగా విశాఖపట్నంలో మరో కార్నర్‌ ఏర్పాటవుతోంది. ఇది ఎంతో సంతోషకరం. ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటవుతున్న అమెరికన్‌ కార్నర్‌ ఇక్కడ ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని నేను

భావిస్తున్నాను. విదేశాల్లోని మంచి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకే కాకుండా, ఇంకా మరెన్నో విధాలుగా సేవలందించడంలో అమెరికన్‌ కార్నర్‌ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 

ఆంధ్ర–అమెరికా మధ్య మరింత బంధం: జోయల్‌ రీఫ్‌మన్‌. యూఎస్‌ కాన్సుల్‌

జనరల్‌:

విశాఖపట్నంకు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా ఇక్కడి అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించాను. ఎందరినో చూశాను. ఈ పర్యటన నాకెన్నో అనుభూతులను మిగిల్చింది. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌

ప్రసాదరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఇది నా తొలి పర్యటన. యూనివర్సిటీ చరిత్రలో ఒక అద్భుత ఘట్టంలా నిల్చే అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.

ఇక్కడ అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు కావడంలో ఎంతో చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వంతో

పాటు, ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ విషయంలో ఎంతో కృషి చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విద్య, ఉద్యోగ రంగాలలో యువతకు.. ముఖ్యంగా మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించడం కోసం రెండు ప్రభుత్వాలు (రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం) కట్టుబడి

ఉన్నాయి. ఆ అవకాశాలు అంది వచ్చేలా చేయడంలో ఈ అమెరికన్‌ కార్నర్‌ ముఖ్య భూమిక పోషించనుంది.
    ఆంగ్లంలో నైపుణ్యం పెంచడం.. నిజానికి ఈ దిశలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే, స్టెమ్‌ (విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లెక్కలు–ఎస్‌టీఈఎం–స్టెమ్‌) విద్య, మహిళా సాధికారత,

అమెరికన్‌ సంస్కృతిపై అవగాహన కల్పించడం, అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించడం తదితర అంశాలలో ఈ అమెరికన్‌ కార్నర్‌ ఎంతో సహాయకారిగా నిలుస్తుంది.
    ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ అమెరికా మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలపడాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌

ఆకాంక్షలను నెరవేర్చడంలో, కలను సాకారం చేయడంలో ఒక వేదికగా ఈ కార్నర్‌ నిలుస్తుంది. అమెరికన్‌ కార్నర్‌ అన్ని సేవలను ఉచితంగా అందజేస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్ర విద్యార్థులు, యువతకు ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని ఆశిస్తూ, ఇందు కోసం ఎంతో చొరవ

చూపి, కృషి చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నపరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి,  ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌

కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఛైర్మన్‌ కె హేమ చంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి కార్యక్రమంలో పాల్గొన్న అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డి, విశాఖపట్నం కలెక్టర్‌

డాక్టర్‌ ఎ మల్లిఖార్జున,  ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam