DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గయా క్షేత్రంలో ఉచిత మహాలయ పక్ష పిండ ప్రదాన సేవ 

*సప్తఋషి చారిటబుల్ వేదపాఠశాల చేస్తున్న మహోన్నత సేవ* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2021 (డిఎన్ఎస్):* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* వివిధ కారణాల వల్ల గతించిన వారికి ఆయా తిథుల్లో పిండ ప్రదానం చెయ్యడం హిందూ సంప్రదాయంలో అత్యంత తప్పనిసరి, పవిత్రమైనది అని వేదం ప్రమాణం. అయితే ప్రతి ఏడాది ఆ తిధి రోజు

చెయ్యవలసిన ఆబ్దిక కార్యక్రమం నిర్వహించలేక పోయినా .  . లేదా దోషం కలిగినా. . .అసలు చెయ్యడం మానేసినా కలిగే దోషాన్ని పరిహారం చేసుకునేందుకు మహాలయ పక్షంలో ఆ తిధి రోజున పితృ  కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంది. 
కొంతమందికి ఏడాది క్రమం తప్పకుండా పితృ కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే మహాలయ పక్షంలో ఆచరించడం ఆనవాయితీ

లేకపోవచ్చు. అలాంటి వారి కోసం విశాఖపట్నంలోని దువ్వాడ సమీపంలో గల సప్త ఋషి చారిటబుల్ వేదపాఠశాల నిర్వాహకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ ఒకమహోన్నతమైన సేవ ను నిర్వహిస్తున్నారు. 
ప్రస్తుతం మహాలయ పక్షం జరుగుతున్నందున వీరి ఆశ్రమ బృందం బీహార్ రాష్ట్రంలోని గయా క్షేత్రంలో బస  చేసియున్నారు. 
ఈ సందర్భంగా అయన డిఎన్ఎస్

తోమాట్లాడుతూ ఈ వైదిక ఆబ్దిక క్రియను ప్రతి ఏడాది తప్పని  సరిగా నిర్వహించుకోవాలని తెలిపారు. మహాలయ పక్షంలో ఈ క్రియను చెయ్యడం రెట్టింపు ఫలితం వస్తుందని అన్నారు. సాధారణ రోజుల్లో గయా క్షేత్రంలో పిండ ప్రదానం చెయ్యడం వలన గృహాల్లో చేసిన క్రియ కంటే మరింత ఫలితం ఉంటుందన్నారు.  అలాంటిది మహాలయ పక్షంలో గయా క్షేత్రంలో మహాలయ

పక్షంలో ఈ క్రియను చెయ్యడం  ద్వారా మహోన్నత ఫలితం లభిస్తుంది అని వేదం ప్రమాణం అన్నారు. 

ఈ సందర్భంగా మహాలయ పక్షం లో సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ హిందూ బంధువులు  అందరి తరపునా గతించిన వారి కోసం పిండ ప్రదానం చేయిస్తున్నట్టు శర్మ తెలిపారు. గతించిన వారి పేరు, గోత్రం తమకు పనినట్టు అయితే వారి తరపున గయా క్షేత్రంలో

ఈ వైదిక పైతృక క్రియ ను చేయడం జరుగుతుందన్నారు. 

ఈ వైదిక క్రియను నిర్వహించుకోకపోవడం వలన సంతానం కలగక పోవడం, అనారోగ్యం, భవిష్యత్ కలుగక పోవడం లాంటి కొన్ని ఇబ్బందులు, అవాంతరాలు తలెత్తుతాయన్నారు. వాటి ప్రాయశ్చిత్తం కోసం మహాలయ పక్షంలో ఈ క్రియను జరుపుకోవాలన్నారు.

ఆసక్తి ఉన్నవారు  ఈ వాట్స్అప్ ( 94923 41294

)నెంబర్ కు గతించిన వారు పేరు, గోత్రం పంపితే గయ లో ప్రస్తుతం జరుగుతున్నా కార్యక్రమంలో వారి పేరు చెప్పడం జరుగుతుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam