DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు సినీ నిర్మాతలు పవన్ కు ఝలక్ ఇచ్చారా? 

"ఇతరుల వ్యాఖ్యలు ఫిల్మ్‌ ఛాంబర్‌కు సంబంధం లేదు*

*(DNS report : సత్య గణేష్ BVS, స్టాఫ్ రిపోర్టర్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2021 (డిఎన్ఎస్):* తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  పవన్ కళ్యాణ్ కు గట్టిగా ఝలక్ ఇచ్చిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. దీనికి  ప్రధాన కారణం  సినిమాల గురించి

ఇతరులు, వ్యక్తిగతంగా చేసిన ప్రకటనలతో తమ ఫిలిం ఛాంబర్ కు ఎటువంటి సంబంధం లేదని ఆదివారం బహిరంగ ప్రకటన విడుదల చేసింది.  

ఇటీవల తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తరపున నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రి పేర్ని వెంకటరామయ్య ను కలిసి తమకు సహకారం అందించామని కోరారు. సినిమా టికెట్లను ప్రభుత్వం తరపున

విక్రయించాలని, పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు.  

అయితే రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం నష్టం కలిగిస్తోందంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలను  తప్పు పడుతూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై ఆంధ్ర

ప్రదేశమంత్రులు, సహా అధికార పార్టీ క్యాడర్ సైతం పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు.  

దీని కి బ్రేక్ వేసేందుకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన విడుదల చేసింది. చిత్ర పరిశ్రమ మనుగడ సాగించాలంటే రెండు ప్రభుత్వాల మద్దతు అవసరమని చెప్పుకొచ్చింది. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తమకూ సంబంధం

లేదని తెలిపింది.ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టం. తాము ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కలిసిన మాట వాస్తవమేనన్నారు. 

ఈ ప్రకటనతో తమకు పవన్ లాంటి నటుల కంటే ప్రభుత్వాలే ముఖ్యం అని బహిరంగం గానే ప్రకటించినట్టు అయ్యింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam