DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ శాఖలు కబోదిగా మారాయా ? : విశ్వహిందూ పరిషత్

విశాఖపట్నం, ఆగస్టు 2 , 2018 (DNS Online ):  à°¹à°¿à°‚దూ ధర్మమని కాపాడవలసిన  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ ధర్మాదాయ శాఖలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కబోదిగా మారిపోయని విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్రా

ప్రాంత ఉపాధ్యక్షులు à°Ÿà°¿ ఎస్ రవికుమార్  à°®à°‚డిపడ్డారు. గురువారం విశాఖపట్నం లోని సింహాచలం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ హిందూ ధర్మం కోసమే

సన్యాసం దీక్ష స్వీకరించిన యతుల ధర్మ రక్షణ కార్యక్రమాలకు అడుగడుగునా à°°à°¾à°•à±à°·à°¸à±à°²à±à°—à°¾ అడ్డుపడుతున్న ప్రభుత్వాలకు బుద్ది చెప్పవలసిన దేవాదాయ శాఖలు కళ్ళు మూసుకు

పోయాయన్నారు. స్వామి పరిపూర్ణానంద మౌనంగా పాదయాత్ర చేస్తామంటే రెండు రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వ రాక్షస ప్రవర్తనకు దేవాదాయ శాఖలు నోరెత్తక

పోవడంపై ఇరు రాష్ట్రాల్లోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. అదే విధంగా విజయవాడ నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర చేయడానికి సిద్ద పడిన శివ స్వామిని

అరెస్ట్ చేసిన ఘనుడు చంద్రబాబు కు త్వరలోనే ప్రజలు గట్టిగా బుద్ది చెప్తారన్నారు. తెలంగాణ లో ఉన్న ఎం ఐ ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తనకు ఇరవై నిమిషాల సమయం ఇస్తే

హిందువు అనేవాడు లేకుండా చేస్తానని బహిరంగంగా సవాల్ విసిరితే నోరు మూసుకున్న ప్రభుత్వం, ప్రశాంతంగా పాదయాత్ర చేస్తా అన్న ఒక హిందూ స్వామిజి ని గృహ నిర్బంధం

చేసిన కేసీఆర్ కు పురాణం కాలం లో రాక్షసులకు పెద్దగా తేడా లేదన్నారు. ఇక ఆంధ్ర లో విజయవాడ లో నగరం నడిబొడ్డులో నలభై ఆలయాలను అడ్డగోలుగా కూల్చేస్తే కళ్ళు

మూసుకున్న చంద్రబాబు కూడా అదే కోవకు చెందుతాడని మండిపడ్డారు. మీకు హిందూ ఆలయాల్లోని హుండీ ల్లో భక్తులు వేసే మొక్కుబడులు, ముడుపులు మాత్రమే కావాలని, భక్తుల

మనోభావాలతో పని లేదన్నారు. తక్షణం ఇరుప్రాంతాల్లోనూ హిందూ స్వామిజి లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశ, లో విశాఖ జిల్లా అధ్యక్షులు ఓ.

నీలకంఠం, ప్రాంత సహా కార్యదర్శి రామ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 


#dns #media #dns #dns news #dnsnews #dnslive #dns live #news agency #vizag #visakhapatnam #visakha #Andhra pradesh #AP #Andhrapradesh #telangana #telangana government #endowments #paripoornananda #siva swami #VHP #vishwa hindu parishad 
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam