DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శిథిల భవనంలోనే అంగన్ వాడి కేంద్రాలు నిర్వహిస్తారా?

*బీజేపీ పద్మనాభం ప్రధాన కార్యదర్శి, మహంతి శ్రీనివాసరావు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులతో దేశవ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాలు నిర్వహించబడుతున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం

పాండ్రంగి గ్రామం లో కూడా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అయితే అవి  శిథిలావస్థకు చేరుకున్న భవనం లోనే నిర్వహించడం అత్యంత బాధాకరమని భారతీయ జనతా పార్టీ పద్మనాభం మండల ప్రధాన కార్యదర్శి, మహంతి అప్పల రమణ ( శ్రీనివాసరావు ) మండిపడ్డారు. 

గత ప్రభుత్వంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులు సుమారు రూ.20  లక్షల

రూపాయలు వ్యయం మంజూరు అవ్వడంతో పాండ్రంగి -1, పాండ్రంగి- 2,అంగన్ వాడి భవనాలను జులై 4 , 2021 న రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమానికి నాటి జిల్లా కలెక్టర్ కూడా హాజరయ్యారన్నారు.  అయితే నేటికి ఆ భవనములను అంగన్ వాడి కేంద్రాలుగా ఉపయోగించలేక పోవడం ఫ్రభుత్వ అధికారుల

నిర్లక్ష్యం అన్నారు.  

ప్రస్తుతం వచ్చిన గులాబ్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం నడుపుతున్న అంగన్వాడి కేంద్రం ప్రక్కనే ఉన్న తుఫాన్ భవనం కోల్పోయింది. అయినా ఆ శిథిలమైన భవనంలో అంగన్వాడి నడిపించడం పిల్లలకు ప్రమాదకరం అన్నారు. వెంటనే అధికారుల స్పందించి వెంటనే అంగన్ వాడి పిల్లలను నూతన భవనము లోకి మార్చాలని డిమాండ్

చేస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam