DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని మోడీ రాజకీయ ప్రస్థానం ఫోటో ప్రదర్శన

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, అక్టోబర్ 01, 2021 (డిఎన్ఎస్):* భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన సందర్భంగా సేవ మరియు సమర్పణ్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా బిజెపి రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి నగర ఒకటో మండలం రెండోవ డివిజన్ నారాయణపురం నందు నరేంద్ర మోడీ రాజకీయ

ప్రస్థానం సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన ఏర్పాటు చేయడమైనది ఎగ్జిబిషన్ ను ను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి మరియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సేవా సమర్పణ్ అభియాన్ 20 రోజుల కార్యక్రమంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం గుజరాత్ ముఖ్యమంత్రిగా 13

సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఏడు సంవత్సరాలు మొత్తంగా 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు సంచలన నిర్ణయాలు చిత్రాలను ఎగ్జిబిషన్ నందు ప్రదర్శించి ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది అని తెలియజేశారు. బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలెపు సత్య సాయిరామ్

 పర్యవేక్షణలో ఒకటవ మండల బిజెపి అధ్యక్షుడు బండి సత్య ప్రసాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, కోడూరి లక్ష్మీనారాయణ, అభయాన్ ఇన్చార్జ్ లు తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam