DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భక్తి శ్రద్దలతో సిరిమానుకు కలెక్టర్ సూర్యకుమారి ఆరాధన

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విజయనగరం, అక్టోబర్ 02,  2021 (డిఎన్ఎస్):* విజయనగరం జిల్లా డెంకాడ మండలం చందక పేట లో  పైడితల్లి అమ్మవారి సిరిమాను పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు.       పూజారి  కలలో కనపడిన అమ్మవారు ఈ సంవత్సరం సిరిమాను కోసం చందకపేట లో నున్న చింత చెట్టును చూపించిన నేపథ్యం లో అక్కడ సిరిమానును

గుర్తించారు.  దేవస్థానం ఈ.ఓ అద్వర్యం లో సిరిమానును శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పాల్గొని అమ్మవారి సిరిమానును పసుపు కుంకుమలతో పూజలు చేసి, ముందుగా గొడ్డలి తో గాటు పెట్టారు. అనంతరం ఈ మానును తరలించి సిరిమాను గా తయారు చేస్తారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ

అమ్మవారి    ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, జిల్లా అన్నింటా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు  బెల్లాన  చంద్ర శేఖర్, నగర మేయర్ వెంపడపు విజయ లక్ష్మి, డిప్యూటి మేయర్లు   రేవతి దేవి కోలగట్ల శ్రావణి,  ఆర్.డి.ఓ భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam