DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టార్ లే వివాదాల్లో ఉంటె సమాజంలో వాళ్ళేమి సందేశాలివ్వగలరు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 04,  2021 (డిఎన్ఎస్):* సమాజంలో వివిధ రంగాల్లో అగ్రస్థాయిలో ఉన్నవాళ్లు అందరికి మోడల్ గా ఉండవలసిన వాళ్ళే నేడు మాదకద్రవ్యాల మత్తు మోజులో జుగుతున్నట్టు వివిధ సంఘటనలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా వెండితెరపై హీరోలు, హీరోయిన్ లు,

డైరక్టర్లు, నటులుగా కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటూ. . సినిమాల్లో మహా నిజాయితీపరులుగా, పోలీసులకు కూడా చేతగానిది వీళ్ళే పెద్ద సాధించేవాళ్లుగా సినిమాల్లో నటించేస్తూ. . . కోట్లాదిమంది ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. 

ఇలా స్టార్ నటులుగా సమాజంలో తిరుగాడుతూ. . .వీళ్ళే పెద్ద సమాజ సేవకులుగా వివిధ

సందర్భాల్లో ప్రజలకి సందేశాలి ఇస్తున్నారు. అయితే సీను కట్ చేస్తే. . వివిధ ప్రాంతాల్లో జరిగిన పొలిసు, రక్షణ బలగాల తనిఖీల్లో మాదక ద్రవ్యాలకు బానిసలుగాను, ఇతరులకు సరఫరా చేయడంలోనూ, దొరికిన దోషుల్లో ఈ అగ్ర తారలు, దర్శకులు, నటీమణులు వాళ్ళ సన్నిహితులు, కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్టుగా వార్తలు మీడియా ద్వారా సమాజానికి

తెలుస్తోంది. 

గత ఏడాది తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు నటులు, నటీమణులు, దర్శకులు ఈ మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులుగా విచారణకు సైతం హాజరుకాగా రెండురోజుల క్రితం బాలీవుడ్ కు చెందిన నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ముంబై పోలీసుల తనిఖీల్లో పట్టుపడడం గమనార్హం. ఇదే విషయాన్నీ ముంబై పోలీసులే బయట పెట్టడం

గమనార్హం. 

ఇలాంటి ఘటనల్లో పట్టుబడుతున్న స్టార్ లు, సమాజానికి, యువతకు సందేశాలు ఇవ్వడానికి ఏ విధమైన అర్హత కల్గియుంటారో వాళ్ళకె తెలియాలి. ఈ స్టార్ లను గుడ్డిగా ఫాలో అయ్యే యువత ఇదే తరహాగా తప్పుడు మార్గం వెళితే వీళ్ళు కుటుంబాల పరిస్థితి ఏంటి అనే విషయం పై ప్రజల్లో అవగాహనా పెంచాల్సిన అవసరం

ఉంది. 

సమాజంలో కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు గానీ, అభియోగాలు చేసే ముందు గానీ, పోలీస్ అధికారులు అన్ని కోణాల లోనూ పరిశోధించి, అన్ని విషయాలు ఖరారు అయినా తర్వాతే అడుగు ముందుకు వెయ్యడం జరుగుతుంది.  వాళ్ళ విచారణలో వెలుగు చూసే విషయాలు తప్పు అయ్యిన సందర్భాల్లో పరిస్థితి మాత్రం కొంచెం

సీరియస్ గానే ఉంటుందన్నది వాస్తవం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam