DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని పేరుతో మభ్యపెట్టి విశాఖ ఆస్తులు అమ్మేస్తారా?

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 04,  2021 (డిఎన్ఎస్):*  విశాఖ నగరాన్ని రాజధాని చేస్తామని ప్రకటించి ఆ పేరుతో ప్రజలను మభ్యపెట్టి విశాఖలోని కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తారా..? అని జివిఎంసి లో జనసేన పక్షనేత పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. నగరంలోని ప్రభుత్వ ఆస్తులు తనఖా

పెట్టి అప్పులు తేవడాన్ని వ్యతరేకిస్తూ సోమవారం మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ విశాఖ నగరంలోని  13 ప్రభుత్వ స్ధలాలు,ఆస్తులను  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో తనఖా పెట్టి 1600  కోట్ల రూపాయలను

సమీకరించడం దివాళా కోరుతనమన్నారు. నవరత్నాల అమలు కోసం వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్  ప్రభుత్వం  తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ ,ప్రభుత్వ ఐటిఐ , దివ్యాంగుల పాఠశాల వంటి వాటిని తాకట్టు పెట్టే దుస్థితికి దిగజారిపోయిందని విమర్శించారు. విశాఖ ను కార్యనిర్వాహక రాజధాని

చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను బహిరంగ మార్కెట్లో తనఖా పెట్టి సొమ్ము చేసుకోవడం  దురదృష్టకరం. దుర్మార్గం. పాలనా రాహిత్యమని మండిపడ్డారు.

విశాఖ నగరంలో విలువైన స్థలాన్ని ఇప్పటికే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రైవేటు పరమై పోయాయని, గతంలో విశాఖ వుడా పరిధిలోని వందల ఎకరాల

భూములను ప్రైవేటు ధారాదత్తం చేసి ఆ నిధులను  హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తరలించారని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన నేతలు వారి స్వార్థం కోసం వందల వేలాది ఎకరాల భూములను ప్రవేట్కు  కట్టబెట్టి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా దిగజారి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలు,

ప్రభుత్వ అధికారుల నివాస గృహాలను నవ రత్నాలకు  నిధులను సమకూర్చుకోవటం నిజంగా ఘోరమే.ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వం వద్ద ఎటువంటి స్థిరాస్తులు, భూములు మిగలవనే ఆవేదన చెందేరు. వాయిదా కట్ట లేదన్న కారణంగా భవిష్యత్తు లో  తహసిల్దార్ కార్యాలయానికో, సర్క్యూట్ హౌస్ కో , పోలీస్ కమిషనర్ నివాస భవనానికి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తాళాలు వేసి స్వాధీన పరచుకునే ప్రమాదకరమైన రోజులు వస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు   పిల్లల విద్యాభ్యాసం చేసే పాలిటెక్నిక్ కళాశాల, ఐ టీ ఐ , దివ్యాంగ శిక్షణా కళాశాలను కూడా ప్రభుత్వం తనఖా  పెట్టిందంటే ప్రభుత్వం ఎంతగా  దిగజారిపోయిందో ఊహించ వచ్చన్నారు. ఈ దివాలాకోరు

ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన  సమయం ఆసన్నమైందని, విశాఖకు రాజధాని వస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ కార్యాలయాలు స్థలాలే తనఖాకు  వెళ్లిపోతున్నాయన్నారు. విశాఖపట్నం  భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందన్నారు. వెనుకపడిన ఉత్తరాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలు , స్థలాన్ని ప్రభుత్వం టార్గెట్

చేసిందంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం ఏమాత్రం జగన్మోహన్  రెడ్డి ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతుంది . రాజకీయాలకతీతంగా నాయకులు ఇప్పటికైనా మేల్కొని వెనుకబడిన ఉత్తరాంధ్ర  ప్రాంతాన్ని మరింత వెనక్కి నెట్టే ఈ  ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పై  ఒత్తిడి

తీసుకొచ్చి తనఖా నుంచి ప్రభుత్వ.ఆస్తులనం  విడిపించాలి. భవిష్యత్తులో ఇదే  తరహా లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలను  తనఖా పెట్టకుండా  చట్టం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దివాలా తీసిన వైయస్ జగన్ ప్రభుత్వ  తనఖా వ్యవహారాలను జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇందుకు వ్యతిరేకంగా

విశాఖ వాసులను చైతన్యపరిచి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నామని, ప్రజలు , రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాల వారు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam