DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 6 నుంచి భద్రాచలంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం 

*రోజుకో అలంకారం, 108 మందితో ఒక్కో కాండ రామాయణ పారాయణ*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 05, 2021 (డిఎన్ఎస్):* దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతి గాంచిన  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అక్టోబర్ 6 నుంచి 15 వరకూ 
శరన్నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా విజయదశమి శ్రీ

రామాయణ పారాయణ మహోత్సవములు వైభవంగా నిర్వహిస్తున్నారు. 

శ్రీ శ్రీ ప్లవ నామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య ది: 06-10-2021 బుధవారం నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి ది: 15-10-2021 శుక్రవారం వరకు చిత్రకూట మండపం లో అష్టలక్ష్మీ అలంకారములు వైభవోపేతంగా ఆకట్టుకోనున్నాయి.  

06-10-2021 న : ఆది లక్ష్మి అలంకారము,   బాలకొండ పారాయణము

 

07-10-2021 న : సంతానలక్ష్మి అలంకారము, అయోధ్యకాండ పారాయణము

08-10-2021న :  గజలక్ష్మి అలంకారము, అయోధ్యకాండ పారాయణము

09-10-2021 న : ధనలక్ష్మి అలంకారము, అరణ్య కాండ పారాయణము

10-10-2021న : ధాన్య లక్ష్మి అలంకారము, కిష్కింధకాండ పారాయణము

11-10-2021న : విజయలక్ష్మి అలంకారము,  సుందరకాండ పారాయణము

12-10-2021

న : ఐశ్వర్య లక్ష్మి అలంకారము , యుద్ధకాండ పారాయణము

13-10-2021 న :  వరలక్ష్మి అలంకారము , యుద్ధకాండ పారాయణము

14-10-2021 న :  మహాలక్ష్మి అలంకారము, యుద్ధకాండ పారాయణము

చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరమ్, ఏకైక మక్షరం భీకం మరో పాతక నాశనమ్

శ్రీరామాయణ పారాయణ ములను తొలగించి సభలను ప్రసాదించు

కల్పవృక్షము ఈ పారాయణమును భద్రాచల క్షేత్రమున చైత్ర శుద్ధ పాడ్యమి నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు ప్రయుక్తముగానూ, ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుండి  శుద్ధ నవమి వరకు శరన్నవరాత్రి ప్రయుక్తంగానూ ఏడాదికి రెండు మార్లు నవాహ్నికంగా జరుపుట ఆచారముగా వస్తోంది.

ఈ శరన్నవరాత్రి వేడుకల్లో శ్రీరామాయణ పారాయణ

మహోత్సవమును 108 మందితో సామూహిక పారాయణముగా పదిరోజుల పాటు నిర్వహిస్తున్నారు. దీనిలో కుల-లింగ-వయో-వర్గ భేదం లేకుండా అందరూ నికి శ్రీ భద్రాద్రి రాముని సేవగా ఈ పారాయణలో పాల్గొనవచ్చును. ఏ ప్రాంతం - భక్తి శ్రద్దలతో పారాయణలో పాల్గొనే వారికి పది రోజుల పాటు ఉచిత వసతి, భోజనం సౌకర్యములతో పాటుగా దర్శనము ప్రసాదము అనుగ్రహ పాత్రలను

దేవస్థానం అందజేస్తుంది.  

విశేష కార్యక్రమములు

అక్టోబర్  7 నుంచి 15 వరకూ  ప్రతి రోజు ఉదయం 11 గంటలకు చిత్రకూట మండపంలో సంక్షేప రామాయణ హోమం జరుగుతుంది. 

15-10-2021 విజయ దశమి రోజున గం॥ 11-30 ని॥లకు శ్రీరామాయణ పారాయణ సమాప్తి సందర్భంగా శ్రీరామ మహాపట్టాభిషేకము, సా॥ గం॥ 4-00లకు శ్రీ భక్తరామదాస నిర్మితమైన

దసరా మండపమున విజయోత్సవము (శమీపూజ) మరియు శ్రీరామ లీలా మహోత్సవము జరుగుతుంది. వివరాలకు  9866743100 సంప్రదించగలరు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam