DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కాషాయ - సైనికుల మధ్య పొత్తు  ఉన్నట్టా. . . లేనట్టా ?

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06,  2021 (డిఎన్ఎస్):* గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లు పొత్తు లో ఉన్నాయి. అయితే ఇటీవల ఇరు పార్టీల వైఖరి చూస్తే. . వీళ్లిద్దరికీ ఏమాత్రం సయోధ్య ఉన్నట్టుగా కనపడడం లేదు. కారణం ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే

నిదర్శనం. 

దేశంలోని రాజకీయాలను ఏ మాత్రం ప్రభావితం చెయ్యలేని పార్టీలు ఏకమై బలమైన శక్తిగా మారేందుకు జరిగేవే రాజకీయ పొత్తులు. వీటికి హద్దు పొద్దు, సమయం - సందర్భం ఇలాంటివేవీ ఉండవు. ఇద్దరికీ నచ్చితే మావిడాకులు,  నచ్చకపోతే విడాకులు.  ఇదే రాజకీయ పొత్తు. ఇది ఎన్నో సార్లు భారత దేశంలో

కనిపించింది. 

అదే విధంగా ప్రస్తుతం ఆంధ్ర లోనూ అదే జరుగుతోంది. ఒక సినిమా కార్యక్రమం లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిర్ణయం పై ఒక వ్యాఖ్య చేసారు. దానిపై అధికార పార్టీలో కార్యకర్త నుంచి మంత్రుల వరకూ పవన్ పై ఘాటైన విమర్శలతో పటు, వ్యక్తిగతంగా కించపరుస్తూ ప్రచారం చేస్తున్నారు. దీన్ని

అడ్డుకునేందుకు జనసేన కార్యకర్తలు సమర్ధవంతంగా మీడియా ద్వారా పోరాటమే చేస్తున్నారు. 

అయితే మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఏ ఒక్క నాయకుడు గానీ, కార్యకర్త గానీ పవన్ కు అండగా నిలబడక పోవడం గమనార్హం. దీన్నిఅతని సినిమా రంగం కనుక బీజేపీ జోక్యం చేసుకోడు అనే వ్యాఖ్య చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా జనసైనికులు

అంతర్మధనం లో పడ్డారు. మిత్ర ధర్మాన్ని బీజేపీ తుంగలోకి తొక్కింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. 

అంతేకాక బద్వేల్ ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్నా ఉప ఎన్నిక పోటీలో జనసేన తమ అభ్యర్థిని నిలపదు అని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడగానే బీజేపీ పార్టీ మాత్రం దీనికి భిన్నంగా తమ అభ్యర్థిని

బరిలో నిలబెడుతున్నట్టు ప్రకటించింది.
దీనిపై ఇటూ వర్గాల నుంచి బహిరంగ స్వరం మాత్రం వినపడడం లేదు. పొత్తులో ఉండి ఉంటే. . ఇరు వర్గాలు చర్చించుకున్న తర్వాతే సంయుక్తంగా ఒక ప్రజాకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పైగా పొత్తు కేవలం ఎన్నికల వరకే అనే ప్రకటన ఇరువర్గాలు గతంలోనే చేసాయి. ప్రస్తుతం ఉప ఎన్నిక విషయంలో ఇద్దరూ రెండు

విధాలుగా ఉండడం చూస్తే. . వీరి మధ్య పొత్తు ఉందా అనే అనుమానమే కలుగుతోంది. 

పైగా ఈ పొత్తు కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఉండడం, తెలంగాణ లో బీజేపీ నేతలు జనసేనను గట్టిగానే విమర్శిస్తుండడం గమనార్హం. 

రాజకీయాల్లో పొత్తులు, ఎత్తులు ఎప్పుడు చిత్ర విచిత్రంగానే ఉంటాయి.ఏ నాయకుడు మనసు ఎప్పుడు మారిపోతుందో

తెలియదు.

ఇదిలా ఉంటె సినిమా ఫంక్షన్ లో ప్రభుత్వం పై పవన్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు సమర్ధించడం చూస్తే. . త్వరలో టిడిపితో పొత్తు పొసుగుతుందా అనే అనుమానమూ కలుగుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam