DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో వేంచేసియున్న శ్రీ కల్కి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో బుధవారం ఉదయం ఉత్సవకావిడితో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రతి సంవత్సరం కన్యామాసంలో శ్రవణా నక్షత్రం నాటికి పదిరోజుల ముందు

ముహూర్తాన్ననుసరించి  నిర్వహించే ఉత్సవకావిడిని సరిగ్గా ఉదయం తొమ్మిదన్నర గంటలకు అర్చకులు, ఆలయ అధికారులుతో కలసి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. 
అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభ సూచికగా సాయంత్రం ఆరుగంటలకు ముందుగా విష్వక్సేన పూజ , పుణ్యాహవాచనం, కంకణ ధారణ , ఋత్విక్ వరుణ , నీరాజన మంత్రపుష్పాలు జరిగాయి. తరువాత

ఆస్థానమండపంలో ఉత్తర ఈశాన్య దిక్కులో ముందుగా సిద్ధం చేసిన ప్రదేశం లో మృత్సంగ్రహణం కార్యక్రమంజరిగింది. తరువాత శ్రీ సుదర్శన పెరుమాళ్ వారిని చిన్నపల్లకీలో వేంచేపు చేసి ఆలయంలో తిరువీధి సేవ నిర్వహించారు. 
తదనంతరం నిత్యసేవాఃఆలం , ప్రసాద నివేదన ,తీర్థగోష్టి జరిగింది. అనంతరం ఆలయం ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన

తాత్కాలిక యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి అంతరాలయపూజ, అంకురార్పణ, చతుస్థాన అర్చనలు , విశేష హోమాలు, గరుడ ప్రాణప్రతిష్ఠ , గరుడప్పాలు నివేదన, తీర్థగోష్టి నిర్వహించారు. దీనితో మొదటి రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల

వరప్రసాదాచార్యులు అర్చకులు పీసపాటి శేషాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, ఆలయ ఇనస్పెక్టర్ పృధ్వీ , బి.విజి రాజశేఖర్ , గ్రామానికి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam