DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా శక్తి వైభవాన్ని తెలిపేవే శరన్నవరాత్రులు 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 07, 2021 (డిఎన్ఎస్):* ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని 'శరన్నవరాత్రి ఉత్సవాలు'గా , 'దేవీ నవరాత్రులు' గా పిలుస్తుంటారు.

మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.
 
భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి , ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని

పూజిస్తారో , వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. 
 
దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి , మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకరించబడిన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు

నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు , సంతాన సౌభాగ్యాలు , సుఖశాంతులు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

ఇక దేవి నవరాత్రి పూజలు చేయుట , అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీ నవరాత్రుల'ను శరన్నవరాత్రులని పిలుస్తూ

శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

*ప్రథమాశైలపుత్రి , ద్వితీయాబ్రహ్మచారిణీ 
తృతీయాచంద్రఘంటీతి , కూష్మాండేతి చతుర్థికీ 
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా

ప్రకీర్తితా.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే ! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే ! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి , నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ

విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త 'దశమి' తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు "దశహరా" అంటే ! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.
ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి ,

హస్తానక్షత్రములో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. 

అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడు రోజులలో

సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు.
కనక దుర్గాదేవి  ( పాడ్యమి ) 
శ్రీ బాల త్రిపుర సుందరి ( విదియ )
శ్రీ అన్నపూర్ణ దేవి (తదియ )
శ్రీ గాయత్రి దేవి ( చవతి ) 
శ్రీ లలిత త్రిపుర సుందరి ( పంచమి ) 
శ్రీ మహాలక్ష్మి దేవి ( షష్టి )
శ్రీ సరస్వతి దేవి ( సప్తమి ) 
శ్రీ దుర్గాదేవి (

అష్టమి) 
శ్రీ మహిససురమర్ధిని దేవి ( నవమి ) 
శ్రీ రాజ రాజేశ్వరి దేవి ( దశమి) 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam