DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధ్వజారోహణంతో ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు ఆరంభం

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 07,  2021 (డిఎన్ఎస్):* లోకైక నాయకుడు, అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఉపమాక లోని గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్న శ్రీ కల్కి వేంకటేశ్వర స్వామి

వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ద్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు డిఎన్ఎస్  కు తెలియచేసారు. 

ఆలయంలో నిత్య కార్యక్రమాలు నిర్వహించిన తరువాత బాలభోగ నివేదన, విశేష హోమాలు, నిర్వహించామన్నారు. తరువాత ద్వజస్థంభం వద్ద

శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ సుదర్శన పెరుమాళ్ వారిని వేంచేపుచేసి విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అభిషేకం, గరుడ లగ్నాష్టకాలు, గరుడ చూర్ణిక ద్వజారోహణ, నీరాజన మంత్రపుష్పాలతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా గరుడ పొంగలి నివేదన చేసి భక్తులకు అందచేశారు. 

గురువారం

నుండి ఈ నెల 15 వ తేది వరకూ శ్రీ సుదర్శన పెరుమాళ్ వారిని పల్లకిలో వేంచేపుచేసి ఆలయంలో గల అష్టదిక్పాలకులకు ఉదయం సాయంత్రం బలిహరణలు నిర్వహిస్తారు. అనంతరం నాలాయిర సేవాకాలం, రాజభోగ నివేదన, తీర్థగోష్టి నిర్వహిస్తారు. 

సాయంత్రం నిత్య ఆరాధనలు , ప్రత్యేక ప్రసాద నివేదన, విశేష హోమాలు, రాత్రి బలిహరణలు నిర్వహించారు.

 శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఈనెల పదిహేనవ తేదీ వరకూ ప్రతిరోజూ సాయంత్రం శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చనలు నిర్వహిస్తారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు  పీసపాటి వేంకట శేషాచార్యులు, ఇల్లింద వేంకట గోపాలాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, జి.వి.వి.ఎస్. భరద్వాజ్, ఆలయ

అధికారులు ఇనస్పెక్టర్ పృధ్వీ, విజిలెన్స్ కు చెందిన బి.వి.జి. రాజశేఖర్ గ్రామానికి చెందిన యు.వి. శ్రీనివాసరావు, దవరశింగి తాతాజీ , ఆత్మకూరి ఫలనీ శ్రీవత్స  తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam