DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలి: ఎడి ఎల్‌.రమేష్‌

*(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)*

*శ్రీకాకుళం, అక్టోబర్ 09,  2021 (డిఎన్ఎస్):* సిక్కోలులో పుట్టిన క్రీడాకారులు ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం క్రీడాకారులు ముందుకు సాగాలని శ్రీకాకుళం సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు ఎల్‌.రమేష్‌ అన్నారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన

జాతీయ స్థాయి ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు, రజితం పథకాలు గెలుచుకున్న జిల్లా క్రీడాకారులకు స్థానిక వైఎస్సార్‌ మున్సిపల్‌ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన అభినందన సభకు రావుల సాయిబాబాస్‌ కుంగ్‌ఫూ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవ సలహాదారు కొంక్యాన వేణుగోపాల్‌ అధ్యక్షత వహించారు. 


కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎల్‌.రమేష్‌ మాట్లాడుతూ జిల్లాలో పుట్టిన క్రీడాకారులు కరణం మల్లీశ్వరి,  పూజారి శైలజ, లక్ష్మీ వంటి క్రీడాకారులు ఎందరో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని, వారి విజయ రహస్యాన్ని నేటితరం క్రీడాకారులు అవపోసన పట్టినప్పుడే మరిన్ని విజయాలు సాధిస్తారన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌ ట్రస్టు

చైర్మన్‌ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం శుభపరిణామని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. సైకిల్‌పోలో జిల్లా అధ్యక్షుడు చౌదరి సతీష్‌ మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, పోటీతత్వంతో ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవకాశాలూ

ఉంటాయన్నారు. వైకాపా నాయకులు సీపాన రామారావు మాట్లాడుతూ శారీరక ధృఢత్వానికి, మానసిక పరిపక్వతకు క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. కిక్‌ బ్యాక్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండా విజయకుమార్‌, వై. హేమంత్‌కుమార్‌, వైకాపా నాయకులు ఉట్ల శ్రీను, కనపల తేజేశ్వరరావు (తేజ), చిట్టిగల భాస్కర్‌

ప్రసంగించారు. 

సమాచారశాఖ ఎ.డి. ఎల్‌.రమేష్‌, క్రీడలను ప్రోత్సహిస్తున్న సూర శ్రీనివాస్‌, చౌదరి సతీష్‌లను కొంక్యాన వేణుగోపాల్ ఆధ్యర్యంలో క్రీడా సంఘాలు సత్కరించాయి. అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్టు, మెడల్స్‌ అతిధులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులు

పాల్గాన్నారు.

విజేతలు వీరే...
ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన 15 మంది క్రీడాకారులు పాల్గొనగా, వీరిలో 11 మంది బంగారు పతకాలు, నలుగురు సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు. సి.హెచ్‌.జ్యోతి, జి.సునీల్‌, జె.అంకిత, ఎస్‌.దేవీవరప్రసాద్‌, వై.బాబీచరణ్‌, జె.కార్తీక్‌, కె.శివహరీష్‌, ఎ.సంజిత్‌,

ఎ.నషీమా, ఎ. రేషా ్మ‌, వై.పవన్‌కుమార్‌ బంగారు పతకాలు సాధించగా, ఎం.సూర్య, బి.తరుణ్‌, వై.కార్తీక్‌రాజ్‌, కె.వంశీ సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam