DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 10,  2021 (డిఎన్ఎస్):* ఇటీవల గుజరాత్ లోని మంద్రా ఓడరేవులో విజయవాడ  లోని ఆశి ట్రేడర్స్ అడ్రసు తో టాల్కం పౌడర్ ముసుగులో జరుగుతున్న  మూడు టన్నుల మాదక ద్రవ్యాల రవాణా పై డి ఆర్ ఐ అధికారులు దాడిచేసి పట్టుకున్న కేసు కి సంభందించిన మూలాలు విజయడవాడలో ఉండటంతో

భారీస్థాయిలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. సత్యనారాయణపురం అడ్రెస్ తో ఉన్న కనీసం సూట్ కేస్ కంపెనీ కాదుకదా మరింత అడ్వాన్స్ స్థాయిలో స్టిక్కర్ అంటించిన  ఆ స్టిక్కర్   కంపెనీ జరిపినట్లు చెపుతున్న కోట్లాది భారీ లావాదేవీల పై విచారించేందుకు శనివారం ఎన్ ఐ ఏ విజయవాడ, కోయంబత్తూర్,చెన్నై లలో దాడులు చేసి అత్యంత కీలక

సమాచారం, సత్యనారాయణపురం లోని ఆశి ట్రేడర్స్ నుండి కీలక డాక్యుమెంట్లుస్వాధీనం చేసుకోవడంతో పాటు అనేక కీలక సమాచారం కూడా తెలుసుకున్నట్లు  ప్రముఖ మీడియాల్లో నేడు సమాచారం వెల్లడైంది.
  ఇంత భారీ స్థాయిలో మాధకద్రవ్యాలు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా భవిష్యత్ లో తమ పిల్లల జీవితం ఎలా వుంటుందోనన్న భయంతో పలువురు ఈ

విషయంలో కేంద్రం మెతక వైఖరిని పలువురు ఎత్తిచూపించటం జరిగింది.దీనితో అనవసరపు అప్రతిష్ట తలమీదకు రావటంతో ఎట్టకేలకు కేంద్రం దీని దర్యాప్తు భాధ్యతను గతవారం  ఎన్ ఐ ఏ కి అప్పగించింది. 
  అప్పగించింది తడవుగా ఎన్ ఐ ఏ తన రెక్కలు విప్పి దర్యాప్తు ముమ్మరం చేసింది.ఈ భాగంలోనే నిన్న విజయవాడ,కోయంబత్తూర్,చెన్నై లలో దాడులు

జరిపి కీలక పత్రాలు,పలు రహస్యాలు సేకరించడం జరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కాగా ఈ బృందం  అదుపులో ఉన్నట్లు చెప్పబడుతున్న మాచర్ల సుధాకర్,ఆయన భార్య లు  ఇంటరాగేషన్ లో వెళ్లగక్కిన  కీలక సమాచారంతో  వారి దర్యాప్తు మరింత విస్తరించినట్లు సమాచారం.ఈ భాగంగా వారి స్వస్థలం అనపర్తితో పాటు కాకినాడలో గత జూన్ లో 25

టన్నుల మాదక పదార్ధాలు దిగుబడి జరిగినట్లు వచ్చినట వార్తలపై కూడా దర్యాప్తు తో పాటు  బోట్లు తగలబడటం లో రేకెత్తిన ఆరోపణలు,తగలపడినట్లు కాకుండా మునిగిపోయినట్లు పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కట్టినట్లు వచ్చిన వార్తలు, బోటుపైనుండి వలవిసరి జారీ పడి ఒక జాలరి చనిపోయినట్లు వచ్చిన అంశం, బోటు,గోడౌన్లు కాలి పోయినట్లు పేర్కొంటున్న వాటి

శకలాలు సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీ కి విశ్లేషణకు పంపటం తదితర అంశాలపై లోతైన దర్యాప్తుకు ఎన్ ఐ ఏ బృందం కాకినాడకు ఏక్షణంలో అయినా  చేరుకుంటుంది అనే విషయం తెలుస్తోంది.కాగా ఈ దర్యాప్తు బృందం విజయవాడ  చేరుకున్నట్లు తెలియటం తో బోట్లమీద పనిచేసే సరంగులు ,తగలబడినట్లు పేర్కొంటున్న గోడౌన్ లలో పనిచేసే వారు  అండర్

గ్రౌండ్ లోకి వెళ్లినట్లు సమాచారం .
ఇలా ఉండగా బోటు తగలబడినట్లు మీడియాలో రావటం, జగన్నాధపురం నుండి   ఫైర్ టెండర్లు వెళ్లి మంటలు ఏర్పటం కూడా మీడియాలో ఫొటోలతో సహా వస్తే బోటు మునిగిపోయినట్లు పోలీస్ ఎఫ్ ఐ ఆర్  లో నమోదు చేసిన విషయంలో వచ్చిన వార్తల పై కూడా ఎన్ ఐ ఏ బృందం దర్యాప్తు జరిపే అవకాశాలున్నాయి.
ఏమైనా కొన్ని

విషయాల్లో కేంద్రం నిర్లిప్తంగా వుంటూ వస్తోందని ఆ అపప్రదను కాదని తేల్చి చెప్పేందుకు ఈ మాదకద్రవ్యాల దిగుమతి విషయంలో ఎంతటి వారున్నప్పటికి తీవ్ర చర్యలకు కేంద్రం అధికారలిచ్చిందని,ఎక్కడా దర్యాప్తులో  ఏ పొరపాటు జరగకుండా, కౌంటర్ చెక్ కోసం మరో షాడో బృందం కూడా ఏర్పాటు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలద్వారా

తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam