DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ పోర్ట్ ట్రస్ట్  తో వ్యాపారానికి విదేశీ సంస్థలు సంసిద్ధత

విశాఖపట్నం, ఆగస్టు 3 , 2018 (DNS Online ):  à°•à±Šà°°à°¿à°¯à°¾ దేశానికి చెందిన దోవా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు పార్క్ జొంగో చోయి క్వాన్గ్ సేక్ లీ హ్యూక్ గిల్ లు

విశాఖపట్నం పోర్టు ట్రస్టును శుక్రవారం సందర్శించారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు ఈ బృందం పోర్టును సందర్శించింది.

విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్ ఎం టి కృష్ణబాబు ఇక్కడ ఉన్న వ్యూహాత్మక అవకాశాలను భారత తూర్పు తీరంలో ఉన్న అవకాశాలు వ్యాపార అభివృద్ది అవకాశాలను వారికి

వివరించారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు నుంచి ఉన్న వివిధ రకాల కార్గో హ్యాండ్లింగ్ అవకాశాలను వివరించారు. విశాఖపట్నం పోర్టులో ఉన్న వివిధ రకాల కార్గో

హ్యాండ్లింగ్ వసతుల పై కొరియా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అవలంభిస్తున్న పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమంపై సంతోషం

వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉచితవాణిజ్య జోన్ ల ఏర్పాటు, కోల్జ్డ్ వేర్ హౌస్ ల ఏర్పాటు ఓడల మరమ్మత్తు ఓడల నిర్మాణం వంటి ఆధునిక వసతులు ఇక్కడ కొలువుదీరనున్నాయని

కొరియా బృందానికి పోర్టు చైర్మన్ వివరించారు.

నేపాల్ కు సంబంధించిన అధికారుల బృందం విశాఖపట్నం పోర్టు ట్రస్టును శుక్రవారం సందర్శించింది. ఎల్ సీ

చెల్లింపులను వేగవంతంగా చేయడానికి కస్టమ్స్ క్లియరెన్స్ లను పూర్తిచేయడానికి అభివృద్ది చేసిన సాఫ్ట్ వేర్ ను నేపాల్ అధికారుల బృందం పోర్టు అధికారులకు

వివరించారు. ఈసందర్భంగా వారు తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను వివరించేందుకు ముఖ్యమైన కంటైనర్ వ్యాపారులు, ఆపరేటర్లు షిప్పింగ్ ఏజెన్సీస్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ

సందర్భంగా తాము నూతనంగా అభివృద్ది చేసిన సాఫ్ట్ వేర్ లో మార్పులు చేర్పులకు సంబంధించిన సూచనలను తీసుకున్నారు. ఈసందర్భంగా విశాఖపట్నం పోర్టు ట్రస్టుతో

వ్యాపారాభివృద్ది కోసం సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేసిన నేపాల్ బృందాన్ని పోర్టు డిప్యూటీ చైర్మన్  à°ªà°¿à°Žà°²à± హరనాధ్ గారు ప్రసంసించారు.

 

 

#dns #dns news #dns live #dnslive #dnsnews #dns media #dnsmedia #vizag #visakhapatnam #visakhapatnam port trust  #vpt

#port trust

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam