DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శబరిమల గుళ్ళోకి రోజూ 25 వేల మందికె అనుమతి: కేరళ సీఎం

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 12,  2021 (డిఎన్ఎస్):* కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం అధ్యక్షతన నేడు  జరిగిన సమీక్ష  సమావేశంలో శబరిమలలో మండల మకరవిలక్కు ప్రారంభమైన నాటినుండి ప్రతిరోజూ 25 వెలమందిని  అనుమతించాలని నిర్ణయించారు.  ఒకవేళ ఈ సంఖ్యను పెంచే విషయం  ఉంటే,  తరువాత చర్చించి నిర్ణయించడం

జరుగుతుందని సమావేశం తీర్మానించింది.  ఇంకా కోవిడ్ నిబంధనలు మేరకు  అవసరమైన చర్యలు తీసుకోబడతాయి. "వర్చువల్ క్యూ" సిస్టమ్ కొనసాగుతుంది. 10 సంవత్సరాల లోపు మరియు 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న యాత్రికులు కూడా ప్రవేశానికి అనుమతించబడతారు.  అయితే శబరిమల వచ్చే అయ్యప్పలు రెండు మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్ లేదా

ఆర్టిపిసిఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ వచ్చిన వారికి ప్రవేశం అనుమతించ  బడుతుంది. అభిషేకం చేసిన నెయ్యిని అందరికి అందేలా  దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేయాలని సిఎం  పినరయి విజయన్ ఈ సమావేశంలో చెప్పారు. అయ్యప్పలను దర్శనం అనంతరం  సన్నిధానంలో ఉండడానికి అనుమతించరు.  

ఈ విషయంలో గత సంవత్సరం పరిస్తితి

కొనసాగుతుంది. యాత్రీకులను ఎరుమేలి మీదుగా అటవీ మార్గంలోగానీ,  పుల్మేడు మీదుగా సన్నిధానానికి గాని  సాంప్రదాయ మార్గంలో అనుమతించరు. పంపా నదిలో స్నానం చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది. యాత్రీకులు వచ్చే వారి వారి వాహనాలు నీలక్కల్ లో పార్క్ చేయడానికి మాత్రమే అనుమతించబడతాయి. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ బస్ లను

 మాత్రం   పంపా వరకు అనుమతిస్తారు. దీనికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు. 

రవాణా సంస్థ  బస్ స్టాప్‌లలో తగిన మరుగుదొడ్లను ఏర్పాటు చేయటం శానిటేషన్ కార్మికుల జీతాలు కూడా ఈ సమయంలో పెంపు చేస్తారు. అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు లేని భవనాలలో స్మోక్ డిటెక్టర్లు

ఏర్పాటు చేయాలి. కోవిడ్‌ మొదలగు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాతే సందర్శనకు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవస్వం (దేవాదాయ) మంత్రి రాధాకృష్ణన్, ఆరోగ్య మంత్రి వీణా జార్జ్, అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్, రవాణాశాఖ మంత్రి ఆంటోనీ రాజు, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ మరియు చీఫ్

విప్ డాక్టర్ ఎన్. జయరాజ్, డిప్యూటీ స్పీకర్ చిట్టాయం గోపకుమార్, ఎమ్మెల్యేలు సెబాస్టియన్ కులతుంగల్ మరియు ప్రమోద్ నారాయణ్, ప్రధాన కార్యదర్శి డా. విపి జాయ్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ అనిల్ కాంత్ మరియు దేవస్వం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఆర్. జ్యోతిలాల్, వివిధ శాఖల కార్యదర్శులు మరియు డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్లు

మరియు దేవస్వం బోర్డు చైర్మన్ ఎన్. వాసు, రైల్వే, బీఎస్ ఎన్ ఎల్ అధికారులు, సంబంధిత మున్సిపాలిటీ - విలేజ్- బ్లాక్ పంచాయితీ అధికారులు, అయ్యప్ప సేవా సంఘం మరియు పందలం రాజకొత్తారం మేనేజ్‌మెంట్ టీమ్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam