DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నమ్మకం మంచిదే, మూఢనమ్మకమే కొంప ముంచుతుంది

(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)

విశాఖపట్నం, అక్టోబర్ 14,  2021 (డిఎన్ఎస్): నమ్మకం అనేది ఒక మంచి ఫలితం చూపిస్తుంది, అయితే అది కొంచెం శృతి మించితే మూఢ నమ్మకంగా మారుతుంది. ఈ విధమైన అతి విశ్వాసాల ఫలితంగా సామాన్యులు నుంచి విద్యా సంపన్నుల వరకూ వీటి ప్రభావానికి లోనవుతుంటారు. అయితే వీటి పై ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు భారత

నాస్తిక సమాజం కొన్ని ప్రాంతాల్లో సదస్సులను మ్యాజిక్ ల ద్వారా నిర్వహిస్తున్నట్టు ప్రచార కర్త  రవితేజ పీసా తెలియచేస్తున్నారు. 

విశాఖపట్నం లోని చిన్నగదిల మండలం రాధాకృష్ణ నగర్ కు చెందిన  రవితేజ మాట్లాడుతూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటుపడుతున్న తన సేవలను, ఆసక్తిని గుర్తించి భారత నాస్తిక సమాజం  యువ

సంఘ సంస్కర్తల ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. రెండు రాష్ట్రాల నుండి 100 మందిని ఎంపిక చేసి విజయవాడలో  స్పెషల్ మ్యాజిక్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మ్యాజిక్ ప్రదర్శనలో చురుకైన ప్రదర్శన ఇచ్చి మ్యాజిక్ పోటీలో బంగారు పతకం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పతకంను ఆంధ్రప్రదేశ్

 ప్రభుత్వసలహాదారు(విద్య), నాడు నేడు రూపకర్త, ప్రజా కలెక్టర్ ఆకునూరి మురళీ గారి చేతుల మీదుగా ఈ బంగారు పతకం అందుకున్నట్టు తెలిపారు.
ఈ స్పూర్తితో మన జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలనకు మరింత పాటుపడతానని తెలుపుతున్నారు. తనను గుర్తించి ప్రోత్సాహం అందిస్తున్న భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఉమ్మడి

రాష్ట్రాల సభ్యత్వ ఇంచార్జి బైరి నరేష్ కి, సహకరించిన స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాలపై మరింత అవగాహనా, వాస్తవ విషయాలను తెలుసుకునేందుకు పూర్తి వివరాలకు రవితేజ ను ఈ మొబైల్ నెంబర్ 9502096752 లో సంప్రదించవచ్చన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam