DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పూసపాటి వంశీయులచే పైడితల్లి సిరిమానోత్సవాలు ప్రారంభం 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విజయనగరం, అక్టోబర్ 18,  2021 (డిఎన్ఎస్):* సోమవారం ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పట్టణంలో వెలసిన శ్రీ పైడతల్లి అమ్మవారి వార్షికోత్సవ సిరిమాను ఉత్సవాల్లో సోమ వారం  తోలేళ్ళ ఉత్సవం, మంగళ వారాల్లో సిరిమాను ఉత్సవం జరుగనున్నాయి. దీనిలో భాగంగా సోమవారం అమ్మవారి దేవస్థానం అనువంశిక

ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులతో కలిసి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు ఊరేగింపులు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి, పైడి తల్లి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
ఈ ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం అన్ని

ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ తెలిపారు. అమ్మవారి ఆలయం తో పాటు నగరంలోని ప్రధాన ఆకర్షణలు కోట, గంటస్తంభం తదితర ప్రదేశాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు.
అయితే ప్రస్తుతం కొరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ ఉత్సవాలను కోవిడ్ నిబంధనలకు లోబడే నిర్వహిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam