DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 న ఇసుకకొండ సత్యదేవుని గుళ్లో పౌర్ణమి ప్రత్యేక వ్రతాలు 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 18,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం నగరం లోని ఇసుక కొండ ( బాబాజి కొండ - కెజిహెచ్ దరి) పై వేంచేసి యున్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లో ఆశ్వయుజ పౌర్ణమి సందర్బంగా ఈ నెల 20 న ఆలయంలో ప్రత్యేక దర్శనములు కల్పిస్తున్నట్టు ఆలయ ఈఓ బండారు ప్రసాద్ తెలిపారు. బుదవారం

ఆశ్వయుజపౌర్ణమి కి యదావిధిగా ఆరాధనాధి కార్యక్రమము ముగించిన అనంతరం ఉదయం 5  గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ కోవిడ్-19 నిభందనలు అనుసరించి భక్తులకు దర్శనములు కల్పించబడుతున్నాయన్నారు. ఉదయం 7:00 గంటలకు మొదటి బ్యాచ్ మరియు ఉదయం 10 గంటలకు రెండొవ బ్యాచ్ ప్రత్యేక ప్రతములు (రూ.1116/-) జరిపించబడను నిత్యపూజ మరియు అన్ని రకముల సేవలను

జరిపించబడుచున్నవి. పౌర్ణమి కి వచ్చే భక్తులు మాస్కు గ్లౌజులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోని సామజిక దూరం పాటించాలన్నారు. 

శ్రీస్వామివారిని యదావిదిగా దర్శించి తరించవలసినదిగా సూచిస్తున్నారు. శ్రీ స్వామి వారి ఆలయంలో ప్రతీ రోజు ఉదయం 8:00 గం||ల కు సత్యనారాయణస్వామి వారి ప్రత్యేక వ్రతము

జరిపించబడుతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam