DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా స్థాయి యోగ పోటీకి గడువు తేదీ అక్టోబర్ 20 కి పెంపు

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 18,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా చోడవరం లోని కొత్తూరు లో గల ఉషోదయ విద్యాసంస్థల నిర్వహణలో అక్టోబర్ 24న జరగబోయే విశాఖ జిల్లా స్థాయి యోగాసనాలు పోటీలు రిజిస్ట్రేషన్ కొరకు గడువు తేదీ అక్టోబర్ 20 వ తేదీ వరకు పొడిగించినట్టు యోగా కేంద్రం గౌరవాధ్యక్షులు పప్పల రమణ

మూర్తి యోగ కేంద్రం చైర్మన్ పసుమర్తి అశోక్ తెలిపారు. ఆసక్తిగల యోగ సాధకులు ఈ నెల 20 లోగా మీ పేర్లును నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.  ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ  పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ మెమొంటో మెడల్స్ తో పాటు నవంబర్ 13 14 తేదీల్లో బాపట్లలో

జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో విజయం సాధించిన వారు డిసెంబర్ హర్యానాలో జరగబోయే జాతీయ  స్థాయి యోగ పోటీలకు అర్హత సాధిస్తారని వివరించారు.  విశాఖ జిల్లాలో ఉన్న యోగ క్రీడాకారులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరిన్ని వివరాలకు 929127690 ఫోన్ నెంబర్ కి ఫోన్

చేసి ఈనెల 20 తారీకు లోపు మీ పేర్లును నమోదు చేసుకోవలసిందిగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ పుల్లేటి సతీష్ తెలిపారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam