DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి పోలీస్ స్టేషన్ల తనిఖీ లో ఏలూరు రేంజ్ డీఐజీ  


*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 18,  2021 (డిఎన్ఎస్):* 
ఏలూరు రేంజ్ డీఐజీ కె విమోహన్ రావు అడిషనల్ ఎస్పీ లా& ఆర్డర్ కె. లతా మాధురి తో కలసి తూర్పు గోదావరి జిల్లా  రాజమహేంద్రవరం అర్బన్ 1వ పట్టణ లా&ఆర్డర్ పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసారు.  అక్కడి పరిస్థితులు, పోలీసు స్టేషన్ పని

తీరు, కేసుల దర్యాప్తు, విజిబుల్ పోలీసింగ్, ప్రజాసమస్యలు పరిష్కారం, పిటిషన్ మేనేజ్మెంట్, డయల్ 100 కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడం గురించి మరియు ఇతర అంశాలపై   సెంట్రల్ జోన్ డిఎస్పీ జె. వి. సంతోష్ తో చర్చించారు.

ఈ తనిఖీలో డీఐజీ స్టేషన్ రికార్డులను పరిశీలించి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని

ఆదేశించినారు, అలాగే UI కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని  తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్టేషన్ రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్ లను పరిశీలించి, స్టేషన్ కు వచ్చు ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి  సూచించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారికీ ఉన్న సమస్యలను అడిగి తెలుసు

కొని, వాటి పరిష్కారానికి సి.ఐ గారికి తగు సూచనలు చేసినారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam