DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎవరి పై నిరసన చేస్తున్నారో తెలియకుండానే. .ధర్నాలా. .

*ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుని పేరుతొ నిరసన బ్యానర్* 

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 21,  2021 (డిఎన్ఎస్):* ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నా రాజకీయ నిరసనల్లో అధికార పార్టీ కి చెందిన నేతలు చెయ్య కూడని తప్పు చేసేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీ

నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన దూషణలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నిరసనలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో సైతం నిరసనలు, ధర్నాలు జరిగాయి. ఈ విభాగం నాయకులూ నిరసనల్లో ముద్రించి, చేత్తో పట్టుకున్న బ్యానర్ వీళ్ళ పార్టీ కె

తలనొప్పులు తీసుకువచ్చింది. 

వీళ్ళు పట్టుకున్న బ్యానర్ లో తెలుగుదేశం నేత భోగరాజు పట్టాభి సీతారామయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అని వ్రాసి ఉంది. 

ఇక్కడే ఇబ్బందిలో ఇరుక్కున్నారు. ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్.

వీళ్ళు బ్యానర్ లో ముద్రించిన పేరు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈయన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు. స్వాతంత్య్ర సమరయోధులు. ఆంధ్ర బ్యాంక్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించిన పెద్దవారు. పైగా ఈయన 1959 లోనే మరణించారు. 62 ఏళ్ళ క్రితం మరణించిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేసారో వీళ్ళకే

తెలియాలి. 

*ఇంతకీ  డిసెంబర్ 17, 1959 లో మరణించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు తెలుగు దేశం పార్టీ (1982 లో ఏర్పడింది) లో ఎప్పుడు చేరారు., ఆయనకు టీడీపీ పార్టీ సభ్యత్వం ఇచ్చిన వారు ఎవరు?* 

*వీళ్ళకి టీడీపీ నేత పట్టాభి ఎవ్వరో అస్సలు తెలియక పోవచ్చు, అది సరే. . .కనీసం స్వాతంత్య్ర సమరయోధుల గురించి కూడా

తెలియదా?* 

అన్నింటికంటే ప్రధానం ఈ బ్యానర్ లో అక్షరాలు, పదాలు 90 శాతం దోషాలతోనే ముద్రించారు.   

ఒక నిరసన ఉద్యమం చేసే ముందు పూర్వాపరాలు తెలుసుకోకుండా, వాటి గురించి అవగాహనా లేకుండా. .రోడ్డెక్కితే మొత్తం పార్టీ పరువు బజారున పడుతుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం.

ఒక స్వాతంత్య్ర సమర యోధున్ని

అవమానిస్తూ వీళ్ళ తప్పుడు బ్యానర్ వ్యవహారం పై స్వచ్చంద సంస్థలు గానీ, వేరే సంఘాలు గానీ బహిరంగ క్షమాపణ కోరే అవకాశమూ లేకపోలేదు.    

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam