DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శృతితప్పిన సెలబ్రిటీలకు సర్వాంతర్యామి సతీష్ మానేషిండే

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 22,  2021 (డిఎన్ఎస్):* భారత దేశంలోని సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్న ఉన్నత శ్రేణి వ్యక్తులు, కుటుంబ సభ్యులు శృతి తప్పి జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే. .వారి పాలిట సర్వాంతర్యామిగా నిలుస్తున్నారు సతీష్ మానేషిండే. కర్ణాటక లోని ధార్వాడ్ కు చెందిన ఈ 55 ఏళ్ళ న్యాయవాది

దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్ల లో ఒకనిగా స్థిరపడ్డారు. అత్యంత క్లిష్టమైన కేసుల్లో దాదాపుగా శిక్ష పడుతున్నది అనిపించే కేసుల్లో సైతం తనదైన శైలిలో వాదనలు వినిపించి సదరు వ్యక్తిని బెయిల్ పై విడుదల చేయించగలగడం ఈయన ప్రత్యేకత. 
కర్ణాటక లోని ధార్వాడ్ కు చెందిన సతీష్, కేవలం లా పట్టా తీసుకుని ముంబై లో అడుగుపెట్టారు ట. 1983

లో ప్రముఖ క్రిమినల్ లాయర్ రామ్ జఠ్మలానీ వద్ద జూనియర్ గా చేసి, దాదాపు 10 సంవత్సరాల కాలం సేవలు అందించి, వివిధ క్లిష్టమైన కేసులను వాదించి, రాటుదేలినట్టు తెలుస్తోంది. 1993 లో ముంబై ప్రేలుళ్ళ ఘటన కేసులో నటుడు సంజయ్ దత్ తరపున కేసును వాదించడం తో తెరపైకి వచ్చాడు. 

బాలీవుడ్ పాలిట భాగ్యసీమ గా కొనియాడబడుతున్న ఈ

న్యాయవాది ఒక్కరోజుకు సుమారు రూ. 10 లక్షలకు పైగానే ఫీజు వసూలు చేస్తారనే వార్తలు ప్రచారం లో ఉన్నాయి. ఇతని ఆస్థి సుమారు రూ. 600 కోట్ల పైమాటే ( 2020 నాటికీ). . 

ప్రస్తుతం బాలీవుడ్ లోని నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల వినియోగం, విక్రేతలతో సంబంధాలు కలిగియున్నాడన్న అభియోగంపై ముంబయి పోలీసులు అదుపులోకి

తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆర్యన్ కేసు వాదించేది ఈ లాయరే. అయితే అన్ని ద్వారాలూ మూసుకు పోయాయి అనుకుంటున్న ఈ కేసులో ఆర్యన్ ను బెయిల్; పై ఎలా తీసుకు వస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనపడుతోంది. 

గతంలో శివ సేన వ్యవస్థాపకులు బాలరాజ్ థాకరే కు న్యాయవాది గా ఉన్న  ఇతను వాదించిన ప్రధానమైన కేసులు :

1

.1993 లో ముంబై ప్రేలుళ్ళ ఘటన కేసులో నటుడు సంజయ్ దత్ తరపున  
2 .1998 లో మద్యం తాగి డ్రైవింగ్ చేసి కృష్ణ జింకలను వేటాడిన కేసులో నటుడు సల్మాన్  ఖాన్ తరపున.   
3 . ముంబై పోలీస్ ఇన్స్పెక్టర్ దయా నాయక్ అక్రమాస్తుల కేసు,  
4 . మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బూకీ శోభన్ మెహతా తరపున, 
5 . చ్చోట రాజన్ భార్య సుజాత నిఖల్జే కేసు, 
6 .

నటి రాఖి సావంత్ ఆత్మహత్య కేసు 
7 . సుశాంత్ రాజ్ పుత్ మృతి కేసులో దోషిగా అభియోగం మోపబడ్డ మోడల్, నటి రియా చక్రవర్తి తరపున కేసు వాదన.
8 . షా రుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల కేసు.

అందరి దృష్టి ఆకర్షిస్తున్న అతి పెద్ద కేసుల్లో వాదిస్తున్న న్యాయవాది ఇతను. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam