DNS Media | Latest News, Breaking News And Update In Telugu

26 న ఓలేటి పార్వతీశంకు సాహిత్య కళాభారతి బిరుదు ప్రదానం

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 25,  2021 (డిఎన్ఎస్):* ప్రముఖ సాహితీవేత్త, సినీ రచయిత, సినీ గేయరచయిత  డాక్టర్ వోలేటి పార్వతీశం కు సాహిత్య కళాభారతి బిరుదు తో సముచిత రీతిలో గౌరవిస్తున్నట్టు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కార్యదర్శి జిఆర్కె ప్రసాద్ ఓ ప్రకటన లో తెలిపారు. ఈ నెల 26 న విశాఖపట్నం లోని

మద్దిలపాలెం లో గల కళాభారతి వేదిక పై ఈ పురస్కారం అందించడం జరుగుతుందన్నారు. 
సాహితీ అభిమానం మెండుగా కల్గిన కళాభారతి అధ్యక్షులు సిఎస్ఎన్ రాజు ఈ పురస్కారం కోసం మూల నిధిని ఏర్పాటు చేసారు. ప్రతి ఏటా ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినం రోజున ఒక ప్రముఖ సాహిత్యకారునికి పురస్కారం అందించాలని

సంకల్పించారు. దీనిలో భాగంగానే మొట్టమొదటి కార్యక్రమం లో పురస్కారం డా. పార్వతీశం కు అందించనున్నారు. ఈ ఏడాది కొరోనా మహమ్మారి ప్రభావం కారకంగా ఈ కార్యక్రమం ఆలస్యం అయ్యిందన్నారు. సమ్మానం అనంతరం పార్వతీశం కందుకూరి పై స్ఫూరిదాయక  ప్రసంగాన్ని ఇవ్వనున్నారు 

డాక్టర్ వోలేటి పార్వతీశం : 

అనేక

దశాబ్దాలు దూరదర్శన్ లోను, రేడియోలోను,  విశేష సేవలందించారు. నంది అవార్డు  గ్రహీత కూడా అయినా ఓలేటి సినీ రచయిత కూడా కావడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam