DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ బూతు సంస్కృతి కి తగిన మందు నాటి గురుకుల విధానమే

*నేటి బాలలకు నాటి గురుకుల విద్యా విధానమే సరైనది*

*బూతు సంస్కృతి పిల్లలకు రాకూదంటే. . ఇదే పరిష్కారం* 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 26,  2021 (డిఎన్ఎస్):* ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా బూతు సంస్కృతిని ఉచితంగా ప్రజలకు మీడియా పరంగా పంచుతున్న

తరుణం లో బాలబాలికలు ఇదే సభ్యత సంస్కారం అనుకునే అవకాశం లేకపోలేదు. ఈ సంస్కృతి నుంచి ప్రస్తుత తరాన్ని కాపాడుకోవడానికి సభ్య సమాజం ముందు ఉన్న ఒకేఒక ప్రజల ముందు పరిష్కారం పురాతన కాలం నాటి గురుకుల విద్యావిధానం. ఈ విద్యా విధానం లో విద్యార్థులు పూర్తి స్థాయి కాలం గురుకులం లోనే  నివాసం ఉండవలసి వస్తుంది. వీరికి కేవలం విద్య

ను మాత్రమే అందించడం జరుగుతుంది. బాహ్య ప్రపంచంతో దాదాపుగా సంబంధం ఉండదు. విద్యా పూర్తిగా ముగిసిన తర్వాతే వారిని గురుకులం నుంచి విడుదల చేయడం జరుగుతుంది. ఈ విద్యా విధానంలో సమాజంలోని సమస్యలకు సభ్య సమాజం హర్షించే విధంగా, శాస్త్ర సమ్మతమైన పరిష్కారాలను తెలియచేయడం జరుగుతుంది. తద్వారా సమాజం పై విద్యార్థులకు భాద్యత

పెరుగుతుంది. ఈ తరహా విద్యా విధానం కేవలం గురుకులం విధానం లోనే లభిస్తుంది. ఇది పురాతన కాలం నుంచి అమలు లో ఉన్న విధానం. దీనికి ప్రత్యక్ష నిదర్శనం నలంద, తక్షశిలలే. తదుపరి కాలంలో భారత్ ను ఆక్రమించుకునే క్రమంలో విదేశీయులు భారతీయ విద్యా విధానాన్ని తొక్కి పెట్టేందుకు విదేశీ సంస్కృతిని అలవాటు చేయడంతో విలువలు పూర్తిగా

పడిపోయే స్థితి కి నేటి విద్యా విధానం తయారయ్యింది. 
విలువలతో కూడిన విద్యా విధానం లభించనట్టయితే. .విద్యార్థులు బాధ్యతాయుతంగా ఎలా ఉండగలరు. 
ప్రస్తుత సమాజంలో రాజకీయ పార్టీలు వినియోగిస్తున్న భాష ప్రయోగం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉండడంతో దీనికి అడ్డుకట్ట వేసి విద్యార్థులను బాధ్యతాయుతంగా తయారు చెయ్యవలసి

ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam