DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హరిత రిసార్ట్స్ కూల్చివేత పై విశాఖ ప్రజాగ్రహం: తెలుగుశక్తి

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 27,  2021 (డిఎన్ఎస్):*  అధికార వైసీపీ అనుసరిస్తున్న ప్రజాకంటక విధానాల పట్ల ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ వ్యాఖ్యానించారు. బుధవారం విశాఖ సాగర తీరంలోని ఋషి కొండ సమీపంలో ( గీతం యూనివర్సిటీ ఎదురుగా) కొండను అకారణంగా త్రవ్వేసి,

అక్కడే ఉన్న హరిత అతిధి గృహాల సముదాయాన్ని కూడా కూల్చేసి, కొండను తవ్వుతున్న ప్రదేశాన్ని బుధవారం ఆయన సందర్శించారు. విషయం తెలిసిన నగర వాసులు పెద్ద సంఖ్యలో ఆగ్రహంతో రోడ్డెకుతున్నారన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కనుసన్నలలోనే ప్రకృతి ప్రసాదిత  కొండను తొలిచి మట్టిని తొలగిస్తున్నారని..

తద్వారా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గీతం యూనివర్సిటీ ఎదురుగా వున్న విశాలమైన బస్ స్టాప్ ను కూడా తొలగించారన్నారు. దీని వల్ల అనేకమంది ప్రయాణికులతో పాటు వేలాది మంది విద్యార్థులు  ఇబ్బందులకు గురికావాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ

అధికారుల కనుసన్నల్లోనే  కొనసాగుతున్నాయని ఆరోపించారు. సాధారణంగా ఒక చిన్న నిర్మాణం చేపట్టాలన్నా, కొద్ది పాటి కార్యకలాపాలు కొనసాగించాలన్నా ప్రభుత్వ అధికారులు, సంబంధిత సంస్థల అనుమతులు అవసరం ఉందన్నారు. కొండను తొలిచే క్రమంలో  మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని,

పోలీసులు బందోబస్తు కూడా  ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  స్పందించాలన్నారు. అదేవిధంగా  ఈ ప్రాంతంలో తొలగించిన హరిత రిసార్ట్ స్థానంలో మళ్లీ  కొత్తగా  హరిత రిసార్ట్ మాత్రమే నిర్మించాలని.. ఇతర నిర్మాణాలు ఏమి చేపట్టినా ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలు

ఉపేక్షించే పరిస్థితిలో లేరన్నారు. గతంలో సుందరమైన గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడను కూడా నిబంధనల పేరుతో అధికారులు తొలగించారని  ప్రస్తావించారు. ఇదే క్రమంలో మొత్తం గీతం యూనివర్సిటీని ప్రభుత్వం ఆక్రమించుకున్నా ఆశ్చర్య పోనక్కరలేదన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దృష్టి సుందర విశాఖ నగరం పై  పడిందని .. ఈ క్రమంలోనే

కొందరు నాయకుల ప్రయోజనాల కోసం  కొండలను తొలగిస్తూ పర్యావరణానికి తీవ్ర హాని చేసేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam