DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలకు పోలీస్ కార్యాచరణ చూపేందుకే ఓపెన్ హౌస్ 

*ఏలూరు విద్యార్థులతో ఏలూరు రేంజ్ డిఐజి మోహన్ రావు* 

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 27,  2021 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థిని, విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమం లో శాంతి భద్రతల పరిరక్షణ,

నేర నియంత్రణ మరియు నేర దర్యాఫ్తులో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాల గురించి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యములో పొలిసు అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు  రేంజ్ డీఐజీ కె వి మోహన్ రావు అతిధిగా పాల్గొని పోలీస్ విభాగం గురించి ప్రధాన అంశాలను తెలిపారు. 

అసాంఘిక శక్తుల అణచివేతలో

,శాంతి భద్రతల పరిరక్షణలో,నేర నియంత్రణ మరియు నేర దర్యాఫ్తులో పోలీస్ వారు తీసుకునే చర్యల గురించి వివరించడమే ఈ *ఓపెన్ హౌజ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు

ఈ ఓపెన్ హౌస్ నిర్వహించడం వలన సమాజ శ్రేయస్సు కొరకు పోలీస్ వారు నిర్వర్తించే విధులు గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన  ఏర్పడి, దీని ద్వారా

ప్రేరణ పొంది తద్వారా యువత పోలీస్ శాఖ మరియు ఇతర భారత బలగాలలో సేవలందించడానికి ముందుకు రావడం జరుగుతుందన్నారు. 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పశ్చిమగోదావరి జిల్లా మరియు కృష్ణాజిల్లా ప్రాంతాలలో ఉద్యోగ నిర్వహణ చేస్తున్న 43 మంది పోలీసు సిబ్బంది కరోనా వైరస్ వలన మరణించినట్లు, వారి యొక్క కుటుంబాల

వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చినట్లు మరియు వారి కుటుంబంలో ఒకరికి అర్హత కలిగిన అటువంటి వారికి ఉద్యోగ కల్పన చేసినట్లు సిబ్బంది యొక్క మౌలిక సదుపాయాల కొరకు సంక్షేమ కార్యక్రమా నికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ఇప్పటివరకు ఏలూరు రేంజి పరిధిలో ప్రాంతాలలో 38 లక్షల మంది తమ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు

సదరు వలన కలిగే లాభాలను గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, దేశ సరిహద్దుల్లోని అంతర్గత వ్యవహారాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసే క్రమంలో పోలీసులు సిబ్బంది అందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

పోలీస్ శాఖలో నేర  దర్యాఫ్తులో ప్రముఖ పాత్ర పోషించే జగిలాల

ప్రదర్శనను తిలకించినారు.

ఈ కార్యక్రమములో పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బరాజు, ఏ.అర్ అదనపు ఎస్పీ బి. రామ కృష్ణ, ఏలూరు డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, ఏ.అర్ డిఎస్పీ కృష్ణంరాజు, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వర ప్రసాద్ గారు పోలీస్ యూనిట్ డాక్టర్ పూజా,

అర్ఐ లు కృష్ణంరాజు, పోలీస్ వెల్ఫేర్ నోడల్ అధికారి అర్.ఐ హోమ్ గార్డ్స్ ఎం. రాజ, సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏలూరు లో గల వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam