DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ కు, షర్మిల కు మధ్య వారధులు టీవీ నటులేనా?

*నాడు జగన్ తో నేడు.. షర్మిలతో పాదయాత్రలో. నటి నటులు* 

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 28,  2021 (డిఎన్ఎస్):* తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కొత్త ఒరవడి సృష్టిస్తూ రోజుకో ఘటన చోటుచేసుకుంటోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతొ  తెలంగాణ లో కొత్తగా పార్టీ ని పెట్టినట్టు ప్రకటించారు. ఈ రెండు పార్టీలకు అనుబంధం గానీ, పొత్తుగానీ ఉందా అనే విషయాన్నీ బహిర్గతం చెయ్యలేదు. ప్రస్తుతం వరకూ వినిపిస్తున్న వార్తల్లో ఈ రెండూ భిన్న ధృవాలే అని తెలుస్తోంది. అయితే వీరిద్దరికి మధ్య సయోధ్య కోసం మధ్యవర్తిత్వం వచించేది టీవీ

నటులేనా? అంటే అవుననే విధంగా ఉన్నాయి వాళ్ళ కార్యాచరణాలు.  

అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతొ ఆంధ్ర లో పాదయాత్ర చేసి విజయం సాధించడంతో, షర్మిల కూడా అదే మంత్రాన్ని మొదలుపెట్టారు. 
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతొ తెలంగాణాలో పాదయాత్రను మొదలు పెట్టారు. 
అయితే

ప్రత్యక్షంగా జగన్ మోహన్ రెడ్డి ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన వారు ఒక్కొక్కరుగా నేడు షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్ర లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులు ఇంతవరకూ ఈమె యాత్రలో పాల్గొన్నది లేదు, అయితే వరుసకు బాబాయ్ అయిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈమె పాదయాత్ర సందర్భంగా ఒకచోట కలిసినట్టు

మీడియా లో వార్తలు వినిపించాయి. అయితే అది కుటుంబ సభ్యునిగా అయి ఉండవచ్చు. 
అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా 2019 ఏప్రిల్ లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన బుల్లితెర నటీ యాంకర్ శ్యామల నేడు అక్టోబర్ 26, 2021 నాటి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో షర్మిల తో కలిసి సంఘీభావం తెలియచేస్తూ పాల్గొన్నారు. ఈమె ఈ యాత్రలో

పాల్గొనడానికి పార్టీకి రాజీనామా చేశారా లేక, పార్టీ అనుమతి తీసుకుని పాల్గొన్నారా అనేది తెలియాలి. సామాన్యులు ఇలా వేరొక ఉద్యమంలో పాల్గొంటే తెలిసే అవకాశం తక్కువ, సెలబ్రిటీ గా ఉన్నవాళ్లు కచ్చితంగా తెలుస్తారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam