DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనకమహాలక్ష్మి గుళ్లో ఆన్ లైన్ ద్వారా పరోక్ష ఆర్జిత సేవలు 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 28,  2021 (డిఎన్ఎస్):* కొరోనా మహమ్మారి ప్రభావం పూర్తిస్థాయి లో తగ్గని కారణంగా విశాఖపట్నం లోని బురుజుపేటలో వెలసిన  శ్రీ అమ్మవారి దేవస్థానం లో ఆర్జిత సేవలు పరిమిత టికెట్లతో సేవలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ జె మాధవి తెలియచేస్తున్నారు.  అయితే

ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తుల సౌకర్యం కోసం ఆర్జిత సేవలను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాడం  జరిగిందన్నారు. భక్తుల పరోక్షంలో ఈ సేవలను పరోక్షంగా భక్తుల పేరు, గోత్రనామాలతో నిర్వహించబడుతుందన్నారు. 

అమ్మవారికి నిర్వహిస్తున్న ఆర్జిత సేవలు, వాటి టికెట్ ధరలను వివరించారు. 

1. శ్రీ

అమ్మవారి దేవస్థానం నందు ప్రతిరోజు త్రికాల సమయాల్లో శ్రీ అమ్మవారి పంచామృత అభిషేకం :-  రూ.516.00/-,  
2. ప్రతి శుక్రవారం క్షీరాభిషేకం:- రూ200.00/-  
3. ప్రతి మంగళవారం  అష్టదళ పద్మారాధన: - రూ.1116/-,  
4. ప్రతి నెలలో పౌర్ణమి రోజు న శ్రీచక్ర నవ అర్చన హోమం:- రూ.2516.00/-, 
5. ప్రతి నెల మొదటి మంగళవారం రోజు లక్ష కుంకుమార్చన :రూ-10,000.00/-

నిర్వహిసున్నామన్నారు  

భక్తులు ఈ సేవలు పరోక్షంగా జరిపించుటకు గాను ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించి, రసీదు తో పాటు మీ పేరు, గోత్రనామాలు, అడ్రెస్ ను ఈ క్రింది దేవస్థానం Email id  (Email id: dceoskmlad@gmail.com )  కి పంపగలరు. 
E-Hundi ద్వారా కానుకలు సమర్పించదలచిన భక్తులు అధికారిక వెబ్సైట్ (Website: aptemples.ap.gov.in ) లో ఆ సదుపాయం కూడా

ఉందన్నారు. 

లేని పక్షంలో దేవస్థానం వారి బ్యాంకు ఖాతాకు కూడా నగదు పంపి మీ వివరాలు ఈ క్రింద తెలిపిన ఈ మెయిల్ (Email id: dceoskmlad@gmail.com ) కి పంపవచ్చునని తెలిపారు. 

Bank Details:          
Account Name-EO skml devasthanam                 
Union bank of india Account No: 060810011006691   
IFSC Code:  UBIN060801.
    
ఇతర వివరాలకు దేవస్థానం ఫోన్ నెంబర్ : 0891- 2711725.

లేదా  Whatsapp no:- 89855 15989 ను సంప్రదించవచ్చన్నారు. దేవస్థానం వారి సేవలను దేవస్థానం  YouTube: లో skml temple ద్వారా సేవలను వీక్షించవచ్చన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam