DNS Media | Latest News, Breaking News And Update In Telugu

31 న శ్రీకూర్మం ఆలయంలో కోటి తులసీదళ అర్చన 

*(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)*

*శ్రీకాకుళం, అక్టోబర్ 29, 2021 (డిఎన్ఎస్):* ఈ నెల  31 న  శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీవైష్ణవ క్షేత్రం శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న కోటి తులసి దళ అర్చనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. విజయవాడ కు చెందిన శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం

స్వామికి కోటి తులసీదళార్చన సేవా కైంకర్యం చేయ సంకల్పం చేసారు. శుక్రవారం ఆలయంలో స్వామిని దర్శించిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సునీత మధుసూదన్ మాట్లాడుతూ  భక్తితో ఒక తులసీదళమును సమర్పించిన చాలు ప్రసన్నులయ్యే శ్రీ మహావిష్ణువును విష్ణుమూర్తిని కోటి నామ సహిత తులసి దళాలతో సేవించుకునే భాగ్యం మనకు రావడం పూర్వజన్మ

సుకృతం అన్నారు. 

ఈ  కార్యక్రమం పై శుక్రవారం జరిగిన సమావేశంలో ఆలయ స్థానాచార్యులు పద్మనాభాచార్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి సురవరం విజయ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు చామర్ల  సీతారామ నరసింహాచార్యులు,  శ్రీకాకుళం జిల్లా విశ్వహిందూపరిషత్ కార్యదర్శి శ్రీరంగం మధుసూదనరావు, శ్రీకాకుళం బజరంగ్ దళ్

అధ్యక్షులు రావాడ రాజశేఖర్, బూరగాపు  రవికాంత్ తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam