DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎట్టకేలకు విశాఖ స్టీల్ ఉద్యమంలో పవన్ సభకు అనుమతి

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 30,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా జరుగుతున్నా ఉక్కు పోరాట సమితి నిరసన సభలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభ కు ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. శుక్రవారం రాత్రి వరకూ అనుమతి నిరాకరించడంతో. .. జనసేన నేతలు, క్యాడర్

గాజువాకలో శాంతి యుత నిరసనలకు సైతం సిద్ధపడ్డారు. ముందుగా అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ వర్గాల్లో ఆవేదన చోటు చేసుకుంది. పవన్ వంటి నేతల సభ లో ప్రసంగిస్తుంటే. . జనాన్ని కట్టడి చేయడం కష్టమని, ట్రాఫిక్ సమస్యలు వస్తాయని అధికారులు చెప్పడంతో, పలు చర్చల అనంతరం సభకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పవన్

విశాఖలోని స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేట్ దగ్గర జరుగుతున్నా దీక్ష శిబిరాన్ని సందర్శిస్తారు, తదుపరి సభలో ప్రసంగించనున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam