DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధ్యాత్మిక తరంగాలు అందిస్తోన్న శ్వాస్ వార్షికోత్సవ వేడుకలు

*(DNS Report : Sairam. CVS, Bureau  Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 30,  2021 (డిఎన్ఎస్):* శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆధ్యాత్మికతను, విశిష్టాద్వైత వైభవ తరంగాలను విస్తృతంగా అందిస్తూ శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి (శ్వాస్) వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భాగ్యనగరం కేంద్రంగా సనాతన సంప్రదాయ అలవాట్లు, శాస్త్ర సమ్మత విధానాలను

ప్రస్తుత తరానికి తిరిగి అలవాటు చెయ్యాలనే తపన, సంకల్పంతో సంప్రదాయ హైందవ వేదవిద్యను అభ్యసించిన యువత ఆలోచనలకూ సాకార రూపమే  ఈ శ్వాస్. 

ఈ సంస్థ ఏర్పడి ఒక ఏడాది కాలం పూర్తి  చేసుకున్న సందర్బంగా వార్షికోత్సవాన్ని కూడా సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమం

ముచ్చింతల్, భాగ్యనగరం  వేదికగా ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు అంతంత వైభవంగా విద్వత్ సభలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ప్రముఖుల ప్రచనల అనంతరం ఆఖరు రోజున సంస్థ కార్యాచరణ ప్రకటించనున్నట్టు యాదగిరి స్వామి, వెంకట కిషోర్ స్వామి తెలియచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam