DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ భవిష్యత్తుకు గో ఆధారిత వ్యవసాయ‌మే దిక్కు: టిటిడి ఈవో

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 30,  2021 (డిఎన్ఎస్):* ప్రపంచ భవిష్యత్‌ కోసం గో ఆధారిత వ్యవసాయమే దిక్కు అని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తి మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ గోమహాసమ్మేళనం శనివారం

అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఇచ్చిన విశిష్టస్థానం, మానవజాతి మనుగడకు గోమాత చేస్తున్న సేవ నేపథ్యంలో గోవిశిష్టతను చాటి చెప్పడం కోసం టిటిడి జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం నిర్వహిస్తోంద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. 

సనాతన హిందూ

ధర్మం లో గోమాతకు విశిష్ట స్థానం

సనాతన హిందూ ధర్మం గోమాతకు అత్యంత ప్రాధాన్యత, ప్రాశస్త్యం కల్పించింద‌ని, త్రేతాయుగంలో శ్రీ‌రామచంద్రుడు గోపరిరక్షణ చేసినందువల్లే రామరాజ్య స్థాపనతో సుపరిపాలన అందించారని తెలుస్తోందని చెప్పారు. ద్వాపరయుగంలో మహాభారత కాలంలో విరాట రాజు కొలువులో పాండవులు తమ అజ్ఞాతవ వాస

కాలంలో ఉత్తర గోగ్రహణం సందర్భంగా చేసిన గోపరిరక్షణ చేయడం వల్ల కూడా వారు తిరిగి తమ రాజ్యాన్ని పొందగలిగారని మనకు తెలుస్తోందన్నారు.

-   1984, డిసెంబరు 3న మధ్యప్రదేశ్ రాష్ట్రం, భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో మిథైల్‌ ఐసో సైనేట్‌ అనే విషవాయువు లీక్‌ కావడంతో వందలాది మంది ప్రజలు చనిపోయిన

దుర్ఘటన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ ఫ్యాక్టరీకి కేవలం ఒక మైలు దూరంలో ఉన్న సోహన్‌లాల్‌ కుష్వాహ, ఎంఎల్‌.రాథోర్‌ కుటుంబాలు మాత్రం ఈ దుర్ఘటన నుండి బయటపడ్డాయ‌ని, ఈ సమయంలో ఆ రెండు కుటుంబాలవారు తమ ఇళ్లలో ఆవు పిడకలు, నెయ్యితో అగ్నిహోత్రం, హోమాలు చేస్తూ ఉన్నారని, వాటి నుండి వెలువడిన హవిస్సు(పొగ) విషవాయువు

ప్రభావాన్ని నిర్వీర్యం చేసిన‌ట్టు ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని తెలిపారు.

-   దేశం ఆర్థికంగా, ధార్మికంగా, ఆరోగ్యపరంగా బాగుపడాలంటే గోసంరక్షణే ఏకైక మార్గమ‌ని, అందువల్లే గోవులను పూజించడం, సంరక్షించడం మనందరి కర్తవ్యమ‌ని చెప్పారు.

-   స్వాతంత్య్రానంతరం వ్యవసాయంలో నూతన పోకడలతో పాటు రసాయనిక

ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతూ రావడం వల్ల భూమిలో ఉన్న జీవ‌రాశులు నాశనమయ్యాయ‌న్నారు. జీవ‌రాశులు, పశుపక్ష్యాదులకు సంబంధించిన ప్రకృతి సిద్ధమైన ఆహారచక్రాలు ధ్వంసమైన‌ట్టు చెప్పారు. గోమాతను సంరక్షించుకుని భూమాతను పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంద‌న్నారు.

           టిటిడి

ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ టంగుటూరు మారుతీప్ర‌సాద్ ప్ర‌సంగించారు. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ మాతా నిర్మ‌లానంద యోగ భార‌తి ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. అనంత‌రం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ర‌చించిన

గోమ‌హ‌త్యం పుస్త‌కాన్ని ఛైర్మ‌న్‌, ఈవో ఆవిష్క‌రించారు.

          ఈ కార్య‌క్ర‌మంలో జెఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, యుగ‌తుల‌సి ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు శివ‌కుమార్‌, సేవ్ ఫౌండేష‌న్

అధ్య‌క్షులు విజ‌య‌రామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam