DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోఆధారిత వ్య‌వ‌సాయ రైతుల‌కు టిటిడి అండ: వైవి సుబ్బారెడ్డి 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 30,  2021 (డిఎన్ఎస్):* గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేసే రైతులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అండ‌గా ఉంటుంద‌ని, వారు పండించిన ఉత్ప‌త్తుల‌ను గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి కొనుగోలు చేస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు

వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. నేల‌త‌ల్లిని కాపాడి ప్ర‌పంచానికి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అందించే దిశ‌గా రైతుల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతోనే జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

         తిరుప‌తి మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం

ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ గోమహాసమ్మేళనం శ‌నివారం వేడుక‌గా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిద‌ని చెప్పారు. మన పూర్వీకులు గోవులను ఆస్తులుగా పరిగణించేవార‌ని, కట్నకానుకల రూపంలో కూడా గోవులనే

ఇచ్చేవార‌ని అన్నారు. రాజ్యాల ఆర్థికబలానికి గోవులు ఒక సూచికలా ఉండేవ‌ని, వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమ‌ని చెప్పారు. యజ్ఞయాగాదులు, హోమాల్లో గోవు పిడకలు, నెయ్యి ఎంతో ప్రాముఖ్యమైనవ‌ని,  నేటి ఆధునిక సమాజంలో కూడా గృహప్రవేశాలు, ఆల‌య కుంభాభిషేకాలు ఇతర శుభకార్యాల్లో ముందుగా

గోవును ప్ర‌వేశ‌పెట్టే సంప్ర‌దాయం న‌డుస్తోంద‌న్నారు.
         తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఓ వైపు పెద్ద ఎత్తున సనాతన హిందూ ధర్మప్రచారం చేస్తూనే, మరోవైపు గోసంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. గోవును జాతీయప్రాణిగా గుర్తించాల‌ని త‌మ‌ ధర్మకర్తల మండలి తీర్మానం

చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింద‌న్నారు. ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి గోసంరక్షణ కోసం కట్టుబడి ఉన్నార‌ని, ఇందులోభాగంగా గత ఏడాది గుంటూరు జిల్లా నరస‌రావుపేటలో నిర్వహించిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొన్నార‌ని అన్నారు.

గుడికో

గోమాత

హిందూ ధ‌ర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామ‌న్నారు. ద‌క్షిణాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీతో క‌లిపి 74 ఆలయాల్లో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామ‌ని, త్వ‌ర‌లో ఈ సంఖ్య‌ను 100 ఆల‌యాల‌కు పెంచ‌డానికి ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు.

దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టిటిడి సిద్ధంగా ఉంద‌ని, గోవుల పోష‌ణ విష‌యంలో ఇబ్బందులు ఎదురైనా టిటిడి ఆదుకోవ‌డానికి సిద్ధంగా ఉంద‌ని వివ‌రించారు.

స్థానికాలయాల్లో గోపూజ

-  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి

ఆలయం, శ్రీకపిలేశ్వరాల‌యం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో భక్తులు గోపూజ చేసుకునే ఏర్పాట్లు చేశామ‌న్నారు.

గో ఆధారిత ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం

-   తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి పూర్వం గో ఆధారిత ప్ర‌కృతి వ్యవసాయ ఉత్పత్తులతో ప్రతిరోజూ

నైవేద్యం సమర్పించేవాని, కాలక్రమంలో ఈ పద్ధతిలో మార్పులు చోటు చేసుకుని రసాయన ఎరువులతో పండించిన ఉత్పత్తులతో స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ వచ్చార‌ని చెప్పారు. త‌మ‌ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో వందల సంవత్సరాల నాటి సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ స్వామివారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం,

కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను ఈ ఏడాది మే 1వ తేదీ నుండి నిత్య నైవేద్యంగా సమర్పిస్తున్నామ‌ని తెలిపారు.  శ్రీనివాసుని కరుణా కటాక్షాలతో ఈ కార్యక్రమం నిరంత‌రాయంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామ‌న్నారు. భార‌త‌దేశంలో ర‌సాయ‌న ఎరువుల‌తో త‌యారుచేసిన‌ దాణా తినే

ఆవుల పాల వ‌ల్ల మ‌హిళ‌ల్లో క్యాన్స‌ర్ పెరుగుతోంద‌ని అధ్య‌య‌నాల్లో తేలింద‌న్నారు. అందువ‌ల్లే ముఖ్య‌మంత్రి ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని, టిటిడి ఈ విష‌యంలో రెండు అడుగులు ముందుకేసింద‌ని చెప్పారు.

నవనీత సేవ

-  దేశీయ గోవుల పాలతో తయారుచేసిన పెరుగును చిలికి

వెన్న తయారుచేసి, తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నవనీత సేవను ప్రారంభించాం. తిరుమ‌ల గోశాలలో కనీసం 150 పాలిచ్చే దేశీయ గోవులను ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయం

-  తిరుమల తిరుపతి

దేవస్థానముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తుల కోసం అలిపిరి శ్రీవారి పాదాల చెంత  నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరిగింద‌న్నారు. ఈ మందిరంలో గోపూజ, గ్రహశాంతి

నివారణ పూజలు, గోతులాభారం, గోవిజ్ఞానకేంద్రం, గోసదన్ ఏర్పాటు చేశామ‌న్నారు.

రైతు సాధికారిక సంస్థతో ఎంఓయు..

-  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ, ప్రకృతి వ్యవసాయ శాఖలతో టిటిడి గో ఆధారిత వ్యవసాయంపై రైతులను ప్రోత్సహించడం కోసం అక్టోబరు 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి

శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఎంఓయు చేసుకున్నామ‌న్నారు.

పంచగవ్య ఉత్పత్తులు

-   కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్‌ ఆయుర్వేద ఫార్మశీ సహకారంతో పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపు, ధూప్‌ స్టిక్స్‌, ఫ్లోర్‌ క్లీనర్‌ లాంటి 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా

పనులు జరుగుతున్నాయ‌ని చెప్పారు.

గోమాత గురించి...

-   భారతీయ ఆలయ సంస్కృతికి, దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజ ఆరోగ్యానికి గోవును మూలస్తంభంగా పురాణాలు చెబుతున్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గోమాత ఒకప్పుడు కీలకపాత్ర పోషించింద‌ని చెప్పారు. గోమూత్రం, పేడ ఎరువుగా పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా

తీసుకోవడం, ఆవు పాలు తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని, పలు వ్యాధుల నివారణకు గో పంచగవ్యాలను మందులుగా కూడా ఉపయోగించేవార‌ని, దీనివల్ల ప్రజలు ఆధునిక వైద్యం వైపు చాలా అరుదుగా వెళ్లేవారని వివ‌రించారు. సమాజంలో చోటు చేసుకున్న నూతన పోకడలు, అవస‌రానికి మించి వ్యవసాయ యాంత్రీకరణ, విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు,

క్రిమిసంహారక మందులు, కలుపు నివారణ మందులు ఉపయోగిస్తుండడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమయ్యాయ‌ని చెప్పారు.
        రెండు రోజుల గోమహాసమ్మేళనం, గో ఆధారిత వ్యవసాయం శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గోసంరక్షణకు సమాజాన్ని పునరంకితం చేసే దిశగా పనిచేయాల‌ని ఆయ‌న కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam