DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ కోసం పవన్ సభ నేపథ్యంలో ట్రాఫిక్ సూచనలు 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 30,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నేపథ్యంలో వ్యతిరేకిస్తూ జరుగుతున్నా ఉద్యమానికి సంఘేభావంగా ఆదివారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ రానున్నారు. ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ సూచనల మేరకు ట్రాఫిక్ సూచనలు చేస్తున్నట్టు అధికారులు

ప్రకటించారు. ఈ మార్పులు ఆదివారం మధ్యాహ్నం 12 గం. నుండి సాయంత్రం సభ ముగిసే వరకు ఈ సూచనలు అమలులో ఉంటాయని తెలిపారు. 

1) అనకాపల్లి వైపు నుండి సదకు వచ్చే అన్ని వాహనాలు అనగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు మొ. AS టెంపుల్ (శనివాడ) జంక్షన్ నుండి కుడి వైపు తిరిగి స్టీల్ ప్లాంట్ లో నెహ్రు పార్క్ తెలుగు తల్లి

విగ్రహం మీదుగా చైతన్య కాలేజీ జంక్షన్ వద్దకు చేరవలెను. కార్లు, ఆటోలు చైతన్య కాలేజీ గ్రౌండ్ లో కేటాయించిన పార్కింగ్ ప్లేసులో నిలుపవలెను. బస్సులు చైతన్య కాలేజీ జంక్షన్ లో ప్రజలను దించి, తిరిగి తెలుగు తల్లి విగ్రహం వద్ద గల నెహ్రు పార్క్ వద్ద నిలవవలెను. ద్విచక్ర వాహనములు, చైతన్య కాలేజీ బంక్షన్ నుండి KBR జంక్షన్ వరకు

రోడ్డు కు ఇరువైపులా సర్వీస్ రోడ్డు లో నిలపవలెను.

2) సభకు విశాఖపట్నం సిటీ వైపు నుండి వచ్చే అన్ని వాహనాలు అనగా ద్విదక్ష వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు మ్కొ, పాత గాజువాక జంక్షన్ దాటిన తరువాత గాజువాక పోలీస్ స్టేషన్ (100 ఫీట్ రోడ్డు ) ఇండన్ నుండి ఎడమ వైపు తిరిగి, జగ్గు జంక్షన్, Y జంక్షన్, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్

మీదుగా KBR జంక్షన్ మీదుగా చైతన్య కాలేజీ జంక్షన్ కు చేరవలెను. కార్లు, ఆటోలు చైతన్య కాలేజీ గ్రౌండ్ లో కేటాయించిన పార్కింగ్ ప్లేసులో నిలుపవలెను. బస్సులు చైతన్య కాలేజీ జంక్షన్ లో ప్రజలను దించి, తిరిగి తెలుగు తల్లి విగ్రహం వద్ద గల నెహ్రు పార్క్ వద్ద నిలపవలెను. ద్విచక్ర వాహనములు, చైతన్య కాలేజీ జంక్షన్ నుండి KBR ఇంకన్ వరకు

రోడ్డు కు ఇరువైపులా సర్వీస్ రోడ్డు లో నిలపవలెను.

3) NH16 లో తగరపువలస వైపు నుండి విశాఖపట్నం వైపు వచ్చు లారీలు మరియు భారీ వాహనాలు అన్నియు ఆనందపురం నుండి పెందుర్తి సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్ళవలెను.

4) NH 16 లో అనకాపల్లి వైపు నుండి విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు లారీలు, వారి వాహనాలు సబ్బవరం,

పెందుర్తి మీదుగా ఆనందపురం వైపు వెళ్ళవలెను.

5) NH 16 లో అనకాపల్లి వైపు నుండి విశాఖపట్నం నగరం లోకి వచ్చే లారీలు, భారీ వాహనాలు అన్నియు. పెందుర్తి NAD జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam