DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ కు పవర్ ఇస్తే 48 గంటల్లో గంజాయి ముఠాలు ఉండవు 

*అంతా కలిసే గంజాయి సాగు ధ్వంసం చేద్దాం, పవన్ పిలుపు* 

*విశాఖ కార్యకర్తల సమావేశంలో జనసేన అధ్యక్షులు వెల్లడి*  

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 01,  2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకు పూర్తి అధికారం ఇస్తే, కేవలం 48 గంటల్లో గంజాయి సాగు ముఠాలను కట్టడి చేసి చూపుతారని,

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం విశాఖ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేసారు.  
ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో అక్రమంగా సాగవుతున్న గంజాయి తోటలు ధ్వంసం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ముందుకు రావాలనీ, అందుకు అవసరం అయితే అఖిపక్షం సాయం తీసుకోవాలని కోరారు. 
నవంబర్ –

డిసెంబర్ మాసాల్లో రూ. 4 వేల కోట్ల గంజాయి ఎగుమతి అవబోతోంది. దీని వల్ల ఎందరి జీవితంలో నాశనం అవుతాయన్నారు. అన్ని పార్టీల వాళ్ళూ వెళ్లి గంజాయి తోటలు నాశనం చేద్దాం అని పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తీసుకువచ్చే ప్రణాళికలు అయితే వైసీపీ ప్రభుత్వం వద్ద లేవని, గంజాయి సాగు మీద

మాత్రం పట్టు ఉందన్నారు. మాట్లాడితే మొన్న వైసీపీ బాబులంతా నా మీద పడిపోయారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. అయితే గంజాయిని అరికట్టేందుకు వైసీపీ సర్కారు లా అండ్ ఆర్డర్ ను ఉపయోగించడం లేదు. 

జనసైనికుల్ని చావగొట్టడానికి ఉపయోగించే లా అండ్ ఆర్డర్ ఏఓబీలో గంజాయి సాగును అరికట్టడం

మీద ఉపయోగించడం లేదు. 

రోడ్డుకు గుంత ఉందని మాట్లాడితే కేసులు పెడతారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో గంజాయి ఎవరు సాగు చేస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ విధానం వాడండి. శాటిలైట్లు వాడండి. ఫోటోలు తీయండి. సాగు చేసే వారి ముఖాలు కూడా తెలుస్తాయన్నారు.  

రహదారుల ఉద్యమాన్ని ఎలా అయితే జాతీయ స్థాయికి

తీసుకువెళ్లామో, గంజాయి వ్యతిరేక ఉద్యమాన్ని కూడా అలాగే ముందుకు తీసుకువెళ్దామని జనసైనికులకు పిలుపునిచ్చారు. 
గంజాయి సాగు ఫోటోలు తీయండి. రవాణా చేస్తున్న వారి ఫోటోలు తీయండి. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ పోలీసులకు వాటిని ఎలా పంపాలో ఆలోచన చేద్దాం. 

బూతులు తిట్టిన వారి మీద పెట్టే

దృష్టి గంజాయి సాగు మీద పెడితే బాగుంటుంది. వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాం మీరు మాకు శత్రువులు కాదు ప్రత్యర్ధులు మాత్రమే. సమస్యలపై మాత్రమే మా పోరాటం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను రూ. 20 వేల కోట్ల అప్పు ఉంది నడపలేమంటున్నారు.. మరి ఆంధ్రప్రదేశ్ కి రూ. 6 లక్షల కోట్ల అప్పు ఉంది దాన్ని అమ్మేస్తారా? అని ప్రశ్నించారు.

 

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మీరు తప్పించుకోవడం కుదరదు. తప్పించుకోకుండా చూసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. రెండేళ్ల సమయం ఉంది మీరెలా తప్పించుకుంటారో చూస్తాం. 

జీవీఎంసీ పరిధిలోని వైసీపీ కార్పోరేటర్లను జనసేన కార్పోరేటర్లు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ ఆపకుండా కార్పోరేషన్లో మాట్లాడే

హక్కు లేదని చెప్పండి. అసలు స్టీల్ ప్లాంట్ తీసేయడానికి కారణం మీరు కాదా? పోస్కోను రాష్ట్రానికి పిలిచింది మీరు కాదా? ప్రధాన మంత్రికి మన సమస్యను స్పష్టంగా చెప్పాలి. వివరించాల్సిన ఎంపీలు కూర్చుని కాంట్రాక్టులుl అడుక్కుంటుంటే ఏం చేయాలి. రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే ఎంపీలు రావాలి. 

మాట్లాడితే నన్ను తిడితే

సరిపోదు. నన్ను బాధ్యత తీసుకోమంటే మీరేం చేస్తారు. పదవులు మీకు బాధ్యతలు మాకా? మీరన్నీ మానేసి ఏఓబీలో గంజాయి సాగు చేసుకుంటారా? ప్రజలకు సుఖవంతమైన జీవితం ఇస్తాం చెత్తను ఊడుస్తాం అని చెత్త మీద పన్నులు వేస్తారా? అని ప్రశ్నించారు. 

అంతకు ముందు జివిఎంసి ఎన్నికల్లో గెలిచినా ముగ్గురు కార్పొరేటర్లు పీతల మూర్తి

యాదవ్, బీశెట్టి వసంత లక్ష్మి, దల్లి గోవిందరెడ్డి  ఆయన ప్రత్యేకంగా అభినందించారు.  
తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ స్పూర్తితో రానున్న ఎన్నికల్లో చట్ట సభలకు ఎక్కువమంది ఎన్నికయ్యేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam