DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భద్రతా పేరిట శిభిరాన్ని బేస్ నుంచి బయటకు గెంటేశారు

విశాఖపట్నం, ఆగస్టు 5 , 2018 (DNS Online) : స్వాతంత్ర దినోత్సవ ( పంద్రాగస్టు ) వేడుకలు కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా సమున్నత రక్షణ సంస్థను (Indian Navy) గౌరవిస్తూ పోరాట దీక్షా

శిబిరాన్ని మార్పు చేసినట్టు  à°¨à°¾à°µà°²à± డాకియార్డ్ ఎక్స్ అప్రెంటిస్సస్ వెల్ఫేర్ అసోసియేషన్, అధ్యక్షులు జనపరెడ్డి కోటేశ్వరరావు తెలిపారు. విశాఖపట్నం: మహా

నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న దేశ రక్షణలో ప్రధాన భూమిక పోషిస్తున్న భారత నేవీ లో అంతర భాగమైన విశాఖ నేవెల్ డాక్ యార్డ్ లో అప్రెంటిస్ శిక్షణ పొంది,డాక్

యార్డ్ లో జరుగు ట్రేడ్స్ మెన్ నియామకాలకు అన్ని ఆర్హ్వతలు కలిగి ఉన్నా అప్రెంటిస్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో డాక్ యార్డ్ యాజమాన్యం

వ్యవరిస్తున్న తీరుకు నిరసనగా ఎక్స్ అప్రెంటిస్ లు 
à°—à°¤ రెండున్నర నెలలుగా శాంతియుత నిరసనలు చేస్తున్నామన్నారు. పోలీసులు తెలిపిన విషయాలకు సహకరిస్తూ  70à°µ

రోజులు గా నేవెల్ బేస్ కు ఎదురుగా ఉన్న బస్ స్టాప్ వద్ద చేపట్టిన నిరాహారదీక్షలు ఆదివారం నాడు విశాఖపట్నం లోని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్

కార్యాలయం à°—à°¾ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద à°—à°² మైదానానికి బదలాయించవలసి వచ్చిందన్నారు. 
ఇన్ని రోజుల నుండి నిరాహారదీక్షలు చేస్తున్నా గాని ఇంత వరకు ఏ ఒక్క

అధికారిగా, డాకియార్డ్ యాజమాన్యం గాని వచ్చి మా సమస్య పై స్పష్టమైన హామీ ఇచ్చిన దాఖలాలు లేవని, అయినా సరే ఎండ అనక, వాన అనక కాలే కడుపులతో ఏనాటికైనా మా ఆవేదనను అర్థం

చేసుకుని న్యాయం చేస్తారని ఎంతో ఆశతో నిరాహారదీక్షలను కొనసాగిస్తున్నామని తెలిపారు. 
ఇంత జరుగుతున్నా మాకు న్యాయం చేయక పోగా పొమ్మనిలేక పొగ పెట్టలేక మా

దీక్షలను మల్కాపురం పోలీస్ వారు ఇక్కడ నుండి మీ దీక్షను జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేసుకోవాలని ఆదేశించారు. అయితే చేసేదిలేక మరో గత్యంతరం కానరాక మా దీక్షా

శిబిరాన్ని అక్కడికి తరలించి యధావిధిగా ప్రతినిత్యం మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగేది లేదు అని హెచ్చరించారు. మేము ఎక్కడ అయితే శిక్షణ పొందినామో అక్కడ మా

ఆవేదనను తెలియజేస్తే న్యాయం జరుగుతుందని ఆశపడ్డామని, రానున్న పంద్రాగస్టు వేడుకలు వల్ల భద్రత కారణాలకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు తెలిపారు. దీనితో భారత

రాజ్యాంగాన్ని, సమున్నత రక్షణ వ్యవస్థ (ఇండియన్ నేవీ) లను గౌరవిస్తూ శాంతియుతంగా చేస్తున్న మా పోరాట శిబిరాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు మారుస్తూ మా

పోరాటాన్ని కొనసాగిస్తాము. దీక్షలో ఏరోజూ ఎవరికీ ఇబ్బంది కలిగించే పనులు చేయలేదు. ఒక బస్సు ఆపడం గాని, ట్రాఫిక్ అంతరాయం గాని, ఏ ఆఫీసర్ కార్ అయినా ఆపడం గానీ ఏదీ

చేయలేదు. అంత శాంతియుతంగా చేస్తున్న మా దీక్షల వల్ల ఆ ప్రాంతంలో భద్రత ఉండదని మమ్మల్ని ఇంకెక్కడో దీక్షలు చేసుకోమనడం చాలా శోచనీయం అని అన్నారు. మనం

ప్రజాస్వామ్య దేశంలోనే బ్రతుకుతున్నామా అని అనుమానం కలుగుతుంది. అన్నం పెట్టమని అమ్మ దగ్గర అడుక్కుంటుంటే,ఇక్కడ కాదు మీరు వేరే ఎక్కడో అడుక్కోండి అని

చెప్పడం చాలా బాధాకరం అని ఈ సందర్భంగా అప్రెంటిస్ సభ్యులు తెలిపారు.డాక్ యార్డ్ యాజమాన్యం నిబంధనలు కు విరుద్ధంగా తప్పుడు SRO లను తక్షణమే రద్దు చేసి అక్రమంగా

చేపట్టిన నియామకాలను అపి మాకు రావలసిన ఉద్యోగాలు మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇకనైనా వెంటనే కోర్ట్ తీర్పులను అమలు చేయాలని, లేని పక్షంలో మా

పోరాటం ఆగేది లేదని తెలిపారు. Sro/150 ప్రకారం నియామకాలు చేపట్టాలని, సుమారు 400వందల మంది ఎక్స్ అప్రెంటిస్లను తక్షణమే 15-08-2018 విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. లేని

పక్షంలో 16-08-2018 నుంచి యదావిదిగా తూర్పు నౌకాదళాధికారి ప్రదాన కార్యాలయం ఎదుట ఆందోళన చెపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వానపల్లి ప్రసాద్, నరవా చంద్రశేఖర, తపన్

దాస్ కుమార్, చిన్ని రమణ, గుజ్జారపు చంద్రశేఖర, చల్లా నారాయణ మూర్తి మరియ ఇతర నాయకులు వందలాది మంది డాకియార్డ్ ఎక్స్ అప్రెంటిస్సస్ పాల్గొన్నారు. 

 

 

#dns #dns news #dnsnews #dnsmedia #dns

media #dnslive #dns live #vizag #visakhapatnam #visakha #naval dockyard #apprenticeship #indian naval 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam