DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చోరీ జరిగిన 72 గంటల్లోగా డ్రైవర్ సహా ముగ్గురు అరెస్ట్ 

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 03,  2021 (డిఎన్ఎస్):* దొంగతనం జరిగిన 72 గంటల్లో నేరస్థులను  అరెస్ట్ చేసిన రాజమహేంద్రవరం పోలీసులను అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అభినందించారు. ఈ ఘటనలో ఒక డాక్టర్ దగ్గర సుమారు 9 నెలల నుండి కారు డ్రైవరు గా పని చేస్తున్న కందుకూరి వెంకటేష్ తన సన్నిహితులతో

కలసి అదే ఇంటిలో దొంగతనం చేసినట్టు విచారణలో తెలిసింది. 

రాజమహేంద్రవరం లోని ప్రకాష్ నగర్ లో గల రాజమండ్రి డయగ్నాస్టిక్ ల్యాబ్ డాక్టర్ బిక్కిన రామ్మోహన్ రావు ఇంట్లో అక్టోబర్ 31 న రాత్రి సుమారు 9.45 నిమిషాల సమయంలో దొంగతనం జరిగినట్టు బిక్కిన సరోజినీ ఫిర్యాదు చేసారు.  ఆ సమయమలో ఇంటి పనులు ముగించుకుని లైట్ లను

ఆర్పీ నిద్రపోవడానికి వెళ్లే సమయంలో వెనుక నుండి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె పై ముసుగు కప్పి బెడ్రూం లోనికి తీసుకుని వెళ్ళి చంపుతామని బెదిరించి, బీరువా తాళం తీసుకుని బీరువ లోని సుమారు రూ.  15 లక్షల నగదు, సుమారు 376 గ్రాముల బంగారు ఆభరణములను దోచుకుపోయారు. 

ఆమెను బెడ్రూంలోనే ఉంచి గది బయట నుండి తాళం వేసి

దొంగిలించిన వస్తువులతో పారిపోయినట్లు ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసారు. బహిరంగంగా జరిగిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దీన్ని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలుగా ఈస్ట్ జోన్ డిఎస్పి ఎటివి రవికుమార్ నేతృత్వంలో ఇనస్పెక్టర్లు ఆర్ జె రవి కుమార్, యంవి సుబాష్, కె.మంగాదేవి లను

నియమించారు.  
అన్ని కోణాలలో క్షుణంగా, సైంటిఫిక్గా దర్యాప్తు చేసి, దర్యాప్తులో అందిన సమాచారం ప్రకారం నవంబర్ 3 న స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురిని అరెస్టు చేసారు. 

ఈ దొంగతనం కేసులో ముగ్గురు ముద్దాయిలు: 
 
1) కందుకూరి వెంకటేష్ s/o నరసయ్య, A/26, SC కాలనీ, రఘుదేవపురం గ్రామం,

సీతానగరం మండలం, ప్రస్తుతం వాంబే గృహాలు, ఆవ రోడ్, రాజమహేంద్రవరం, 
2) పడమట్ల దుర్గా గణపతి s/o సోమరాజు, A/26, D.No.41-2-112, మున్సిపల్ స్కూల్ వెనుక వీధి, వీరభద్రనగర్, తాడితోట, రాజమహేంద్రవరం. 
3) షేక్ శ్రీనివాస్  s/o హుస్సైన్, A/23, D.No.41-2-130, మున్సిపల్ స్కూల్ వీధి, వీరభద్రనగర్, తాడితోట, రాజమహేంద్రవరం, 

ఈ కేసుకు సంబంధించి చోరి

సొత్తు 375 గ్రాములు బంగారం వస్తువులును మరియు Rs.8,40,000/- నగదును వారి వద్దనుండి స్వాధీనపర్చుకొని సదరు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam