DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాహనాలపై అనుమతి లేని సైరన్లు తొలగించాలి : విశాఖ పోలీస్

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 10,  2021 (డిఎన్ఎస్):* మహా విశాఖపట్నం నగర పరిధిలోని అన్ని తరహాల వాహనదారులు తమ వాహనములుకు ఉన్న అనుమతి లేని సైరన్లు, హరన్లను  తొలగించవలసిందిగా విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.  వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి, పై ఉల్లంఘన జరపకుండా ట్రాఫిక్

నియమాలను పాటిస్తూ విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నారు. 
ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వాహనముల చట్టం ప్రకారము చర్య తీసుకోబడుతుందన్నారు. ఈ నిబంధన అన్ని ప్రభుత్వ/ప్రైవేటు వాహనములకు వర్తిస్తుందన్నారు. 

ఈ మధ్య కాలంలో కార్డు / ఇతర వాహన వినియోగదారులు

అనధికారికంగా సైరన్లు, తమ వాహనాలకు అమర్చి, వాడుటవలన రోడ్ పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు ఇబ్బందికి గురై, తద్వారా ప్రమాదములు జరుగుతున్నాయన్నారు. 
వాహన వినియోగదారులు పై విషయాన్ని గమనించి, తక్షణం తమ వాహనములుకు ఉన్న సైరన్లు తొలగించవలసిందిగా సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam